రంగస్థలంలో చెవిటి పాత్రలో అలరించాడు రామ్ చరణ్. ఇపుడు మరో ప్రయోగాత్మక పాత్రకు సిద్ధమయ్యాడు. ప్రస్తుతం రామ్‌చరణ్ కథానాయకుడిగా శంకర్ ఓ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ ది డబుల్ రోల్. ఫ్లాష్ బ్యాక్ తండ్రి పాత్రలో ప్రజంట్ లో కొడుకు పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే ఇందులో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో రామ్ చరణ్ పాత్రకు నత్తి వుంటుందని తెలిసింది. శంకర్ ఈ నత్తి పాత్రని చాలా ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు సమాచారం. నత్తి పాత్రలో ఇటివలే విజయ్ దేవరకొండ లైగర్ లో, ఎఫ్ 3లో వరుణ్ తేజ్ కనిపించారు. రామ్ చరణ్ నత్తి పాత్రలో కనిపించడం ఇదే తొలిసారి.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే ఓ పాట చిత్రీకరణ కోసం న్యూజిలాండ్ వెళ్లారు. ఇందులో రామ్‌చరణ్‌కి జోడీగా కియారా అడ్వాణీ నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ఆయనకి ఇది 50వ చిత్రం కావడం విశేషం. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ నుండి రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. అలాగే రామ్ చరణ్ -శంకర్ కావడం కూడా మరో ఆసక్తికరమైన అంశం.