బ్రూస్ లీ తర్వాత రామ్ చరణ్ చేస్తున్న సినిమా స్టార్ అవ్వబోతుంది. తమిళ సినిమా తని ఒరువన్ రీమేక్ గా వస్తున్న ఈ సినిమాకు మొన్నటిదాకా ‘రక్షక్’ అనే టైటిల్ పెడుతున్నారని తెలిసినా ఇప్పుడు ‘ధృవ’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు.
సినిమాలో హీరోయిన్ గా మరోసారి రకుల్ ప్రీత్ సింగ్ నే ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నారట దర్శక నిర్మాతలు. త్వరలో షూటింగ్ స్టార్ట్ కానున్న ఈ మూవీలో పవర్ ఫుల్ పోలీస్ గా చరణ్ కనబడనున్నారు. మాతృక సినిమాలో ప్రతి నాయకుడిగా చేసిన అరవింద్ స్వామి మరళ ఈ సినిమాలో కూడా విలన్ రోల్ చేస్తున్నారు. మైండ్ గేంతో కూడిన కథాంశంతో వచ్చిన ఈ సినిమా తమిళ నాట గొప్ప విజయాన్ని అందుకుంది.
తెలుగులో కూడా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కించబడుతున్న ఈ సినిమా అలాంటి ఫలితాన్నే ఇస్తుందని భావిస్తున్నారు చిత్ర యూనిట్. సినిమాను కూడా త్వరగానే పూర్తి చేసి ఈ సంవత్సరం దసరా రేసులో నిలపాలని ఆరాటపడుతున్నాడు చరణ్. మరి బ్రూస్ లీ మిగిల్చిన అసంతృప్తి నుండి ఈ ధ్రువ బయటపడేలా చేసి కలక్షన్స్ లో రికార్డులు సృష్టించాలని కోరుకుంటున్నారు మెగా అభిమానులు.