చిరంజీవి సినిమా ఈ సంక్రాంతి బరిలో నిలిచింది. ఇప్పటికే దాదాపు బిజినెస్ మొత్తం క్లోజ్ అయ్యిందని, భారీ ఎత్తున టేబుల్ ప్రాఫిట్ లభించిందని చెప్పుకొంటున్నారు. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం నైజాంలో మాత్రం ఖైదీ నెం.150 అమ్ముడవ్వలేదు. ఈ సినిమా రైట్స్ ఏషియన్ సినిమా చేతికి వెళ్లడం వెనుక రామ్‌చరణ్ భారీ ప్లాన్ ఉందని తెలుస్తోంది. ఖైదీ నెం.150 నైజాం రైట్స్ ఏషియస్సినిమా వాళ్ల దగ్గర ఉన్నాయి. నిజానికి ఈ సినిమాని వాళ్లూ కొనలేదు. పేరుకు మాత్రమే వాళ్లది. నైజాం మొత్తం చరణ్ తన చేతుల్లోనే ఉంచుకొన్నాడని తెలుస్తోంది. నైజాంలో కనీ వినీ ఎరుగని రేట్లు చెబుతుండడంతో ఈ సినిమాని కొనడానికి ఏ డిస్టిబ్యూటరూ సాహసించలేదని తెలుస్తోంది.
అందుకే.. సొంతంగా రిలీజ్ చేయించుకోవాలని చరణ్ ప్లాన్ వేశాడు. గీతా ఆర్ట్స్ ద్వారా నైజాంలో రిలీజ్ చేసుకోవొచ్చు. కానీ… సినిమాని అమ్మలేదు… అనే విషయం అందరికీ తెలిసిపోతుంది. అదే ఏషియన్ ద్వారా విడుదల చేస్తే.. ‘ఖైదీని నైజాంలో ఇంతకు అమ్ముకొన్నాం.. అంతకు అమ్ముకొన్నాం..’ అని ఘనంగా అంకెలు చెప్పుకోవొచ్చు. అదీ.. చరణ్ ప్లాన్. చిరు, వినాయక్‌ల పారితోషికాలు పక్కన పెడితే చిరు సినిమాకి రూ.35 కోట్ల వరకూ అయ్యిందని తెలుస్తోంది. సినిమా యావరేజ్‌గా ఉన్నా కళ్లు మూసుకొని రూ.50 కోట్ల వరకూ రాబట్టొచ్చు. హిట్ అయితే రూ.70 కోట్ల వరకూ చేస్తుంది. అంటే.. లాభాలు తప్ప, నష్టాలు రావడం అసాధ్యమన్నమాట. సో.. ఆ ధైర్యంతోనే కొన్ని ఏరియాల్లో ఈ సినిమాని సొంతంగా రిలీజ్ చేసుకొంటున్నాడని తెలుస్తోంది.