బ్రూస్లీతో రామ్‌చరణ్‌కి బొప్పి కట్టింది. అంతకు ముందు గోవిందుడ అందరివాడేలే కూడా గొప్ప సినిమా కాదు. బండ్ల గణేష్ ఆ సినిమాతో నష్టపోయాడు కూడా! అందుకే ఈసారి తనిఒరువన్ రీమేక్ ని ఎలాగైనా హిట్ చేయాలన్న కసితో ఉన్నాడు చెర్రీ. తమిళంలో తని ఒరువన్ సంచలనాలు సృష్టించింది. స్ర్కిప్టు విషయంలో ఇహ చూసుకోవలసిన అవసరం లేదు. సాంకేతికంగానూ మంచి టీమే దొరికింది. అందుకే తన లుక్ పరంగా జాగ్రత్తలు తీసుకొంటున్నాడు చరణ్.
ఈ సినిమా కోసం చరణ్ గుర్రపుస్వారీ నేర్చుకొంటున్నాడట. సైక్లింగ్‌లోనూ శిక్షణ తీసుకొంటున్నాడట. చరణ్ మగధీర సమయంలోనే గుర్రపుస్వారీ నేర్చుకొన్నాడు. అయితే… ఈ సినిమాలో గుర్రపు స్వారీ నేపథ్యంలో ఓ ఫైట్ ఉందట. ఆ ఫైట్ రక్తికట్టడానికి కష్టతరమైన శిక్షణ తీసుకొంటున్నాడని చిత్రబృందం తెలిపింది. అంతేకాదు… బరువు తగ్గి తన బాడీ షేప్నీ మార్చుకొంటున్నాడు చరణ్. ఈ సినిమాకి ధృవ అనే టైటిల్ పిక్స్ చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రెజీనా కథానాయిక. ఈ దసరాకి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.