టాలీవుడ్లోనే కాదు…. ఎక్కడైనా సరే ‘హిట్ల’కే గిరాకీ. ఒకట్రెండు ఫ్లాపులు వస్తే… ఎవ్వరూ అటువైపు కన్నెత్తి కూడా చూడరు. పారితోషికాలు అమాతం తగ్గిపోతుంటాయి. అయితే ఒక్కోసారి చేతిలో హిట్లున్నా సరే – రెమ్యునరేషన్ తగ్గించుకోవాల్సివస్తుంది. ప్రస్తుతం రామ్ పరిస్థితీ అంతే. రామ్ కథానాయకుడిగా ‘ఇస్మార్ట్ శంకర్’ అనే చిత్రం రూపుదిద్దుకుంటోంది. పూరి జగన్నాథ్ దర్శకుడు. ఈ చిత్రానికి ఆయనే నిర్మాత. పూరి అసలే డౌన్ ఫాల్లో ఉన్నాడు. పూరి – రామ్ కాంబో… అనగానే బిజినెస్ జరిగిపోయే రోజులు కావివి. పూరిపైనే ఎక్కువ రిస్క్ ఉంది. అందుకే.. రామ్ కూడా ఆ రిస్కులో భాగం పంచుకోవడానికి రెడీ అయినట్టు టాక్.
రామ్ పారితోషికం దాదాపు 3 కోట్ల వరకూ ఉంటుంది. ఆ పారితోషికంలో సగానికి సగం తగ్గించుకున్నట్టు తెలుస్తోంది. అదీ.. పూరీ కోసమే. రామ్ ఏరి కోరి పూరి కథ ఎంచుకున్నాడు. కథ ఒప్పుకున్న వెంటనే ‘పారితోషికంతో పనిలేదు.. క్వాలిటీ తగ్గకుండా సినిమా తీయండి చాలు’ అని చెప్పాడట. దానికి పూరి కూడా సై అన్నాడు. అందుకే రామ్ పారితోషికంలో బారీ కొత పడిందని టాక్. సినిమా హిట్టయి, లాభాలొస్తే… అప్పుడు రామ్కి పూర్తి స్థాయి పారితోషికం చెల్లిస్తారన్నమాట. మిగిలిన హీరోలు, దర్శకులూ ఇలానే ఆలోచిస్తే.. నిర్మాతపై కాస్తయినా భారం తగ్గుతుంది కదా?