దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి శ్రీదేవి అంటే పిచ్చి. శ్రీదేవిపై వున్న ఇష్టంతోనే సినిమా ఇండస్ట్రీకి వచ్చానని చెబుతుంటాడు వర్మ. లవ్,ప్యాషన్, క్రష్.. ఇలా అన్నీ శ్రీదేవినే అని ఓపెన్ గానే చెబుతుంటాడు ఆర్జీవి. ఇండస్ట్రీకి వచ్చి రాగానే శ్రీదేవితో ఓ రెండు సినిమాకు కూడా తీశాడు. అయితే ఇంతంలోనే శ్రీదేవి, బోని కపూర్ ని పెళ్లి చేసుకొని సెటిలైపోయింది. ఆ సమయంలో తన మనసు బద్దలైపొయిందని తన ఆత్మకధలో రాసుకున్నాడు ఆర్జీవీ. అయితే అప్పటికి ఇప్పటికీ శ్రీదేవిపై ఆయనకున్న ప్రేమాభిమానం పోలేదు. వీలుకుదిరినప్పుడల్లా శ్రీదేవి ప్రస్తవన తీసుకొస్తుంటాడు వర్మ.
తాజాగా మరోసారి శ్రీదేవిని లైన్ లో పెట్టాడు వర్మ. బాహుబలిలో’శివగామి’ పాత్రకు శ్రీదేవి ఒప్పుకుని ఉంటే క్రెడిట్ మొత్తం ప్రభాస్ కంటే ఆమెకే దక్కి ఉండేదని ఓ ట్వీట్ త్వీటాడు వర్మ. శివగామి పాత్రకు ఒప్పేసుకుని ఉంటే ఆమె కెరీర్లోనే బాహుబలి చిత్రం ఓ మైలురాయిగా నిలిచేదని, ప్రభాస్ కంటే ఎక్కువ క్రేజ్ ఆమె సొంతమయ్యేదని చెప్పుకొచ్చాడు ఆర్జీవి.
బాహుబలి’లో శివగామి కోసం మొదట శ్రీదేవిని ఎంపికచేసుకోవాలని భావించాడు రాజమౌళి. కొన్ని కారణాల వల్ల శ్రీదేవి ఈ పాత్రకు ఒప్పుకోలేదు. దీంతో రమ్యకృష్ణను ఎంపిక చేశారు. అయితే ఈ పాత్రలో ఆమెను తప్ప మరొకరిని వూహించుకోలేనంతగా రక్తికట్టించింది రమ్య. మరి ఇపుడు రామ్ గోపాల్ వర్మకు శ్రీదేవి ఎందుకు గుర్తుకువచ్చినట్లో. ఆయన అభిప్రాయం ఏమిటో గానీ ఈ పాత్ర వదులుకున్నందుకు శ్రీదేవి మాత్రం ఒక లైఫ్ టైం ఛాన్స్ మిస్ అయ్యిందనే చెప్పాలి.