హైదరాబాద్: విజయవాడ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు వంగవీటి రాధాపై దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. వంగవీటి రాధా కాపు కులంలో పుట్టినాకూడా అతనిది కమ్మమనస్తత్వమని అన్నారు. కాపుల వెనక దాక్కున్న కమ్మ మనస్తత్వమున్నవాడిని మొదటిసారి చూస్తున్నానని ట్విట్టర్లో పేర్కొన్నారు. తనకు క్యాస్ట్ ఫీలింగ్ లేదని అన్నారు. రంగా గురించి రాధా కంటే తనకే ఎక్కువ తెలుసని పేర్కొన్నారు. రంగా గురించి తీసే సినిమాను తేడాగా తీస్తే అభిమానులు ఊరుకోరని రాధా ఇచ్చిన వార్నింగ్‌కు తాను కౌంటర్ వార్నింగ్ ఇస్తున్నానని, ముందు రాధా అతని ఫ్లాష్ బ్యాక్ అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు. నాటి రాధా, రంగాలతో తానెక్కువ సమయం గడిపానని చెప్పారు. ఇవాళ్టి రాధా బ్యాక్ గ్రౌండ్లో పిల్లాడిలాగా ఆడుకోవటం చూశానని అన్నారు. ఇవాళ్టి రాధాకు అలనాటి రాధా విలువలో ఒక్కశాతం అర్థమైనా తను కూడా మాటల మనిషి కాకుండా చేతల మనిషి అయ్యుండేవాడని పేర్కొన్నారు. స్పాట్లు పెట్టినవాళ్ళకు పుట్టినంత మాత్రాన వాళ్ళే స్పాట్లనుకుంటే అది వాళ్ళ పిల్లతనమని వర్మ వ్యాఖ్యానించారు. రాధా అప్పుడు పిల్లోడని, చెప్పుడు మాటలు నమ్మాడని, కానీ తానప్పుడు స్పాట్లో ఉన్నానని పేర్కొన్నారు.