హైదరాబాద్: బాలీవుడ్ హీరోయిన్ జియా ఖాన్ ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని తెలియగానే తాను భోరున విలపించానని దర్శకుడు రాంగోపాల్ వర్మ చెప్పారు. ఆమెకు తాను ఎప్పుడూ సన్నిహితంగా లేనప్పటికీ తన దుఃఖాన్ని ఆపుకోలేకపోయానని తెలిపారు. చలనచిత్రరంగంలో సహజమైన ఆశాభంగాలు, ఫ్రస్ట్రేషన్లను తట్టుకోలేని కొద్దిమంది మనుషులలో ఆమె కూడా ఒకరని పేర్కొన్నారు. వర్మ తన ఆత్మకథ ‘గన్స్ అండ్ థైస్’లో ఈ విషయాన్ని రాసుకున్నారు. జియాఖాన్‌తో వర్మ నిశ్శబ్ద్ అనే చిత్రాన్ని రూపొందించారు. ఈచిత్రంలో అమితాబ్ కీలక పాత్ర పోషించారు. జియా ఖాన్ 26 ఏళ్ళ వయసులో 2013 జూన్ నెలలో ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. తాను మొదట ఆమెను చూడగానే మోస్ట్ ఇన్నోసెంట్ సెక్సీయెస్ట్ గాళ్ అనుకున్నానని వర్మ రాశారు. జియా పెద్ద స్టార్ అవుతుందని అందరూ అనుకున్నారని పేర్కొన్నారు.
‘గన్స్ అండ్ థైస్’ పుస్తకంలో వర్మ శ్రీదేవి తొడలపైన కూడా వ్యాఖ్యలు చేశారు. మరోవైపు అమితాబ్‌ను నిశ్శబ్ద్, ఆగ్ చిత్రాలలో తీసుకోవటం తన తప్పని కూడా పేర్కొన్నారు. విడుదలకు ముందే ఇంత సంచలనం సృష్టిస్తోన్న ‘గన్స్ అండ్ థైస్’ విడుదల తర్వాత ఎంత సంచలనం సృష్టిస్తుందో చూడాలి.