రామ్ గోపాల్ వర్మలోని క్రియేటర్ ఎప్పుడో గతంలో కలిసిపోయాడు. ఆయన తీసిన చివరి జనరంజకమైన సినిమా ఎవరికీ గుర్తులేదు కూడా. ఇప్పటి జనరేష్ కి వర్మ అంటే మతిగతి లేని ట్వీట్లు పెట్టే ఓ నెటిజన్ గా మాత్రమే ఎక్కువ పరిచయం. ఇప్పుడు వర్మకు సొంతగా కథ ఆలోచించి సినిమా తీసే ఓపిక కూడా లేదు. పబ్లిక్ డొమైన్ లో వుండే కంటెంట్ నే షార్ట్ ఫిల్మ్ కంటెంట్ దారుణమైన క్యాలిటీతో తీసి వదులుతున్నాడు. ఆ సినిమాలు ఎప్పుడు వస్తున్నాయో పోతున్నాయో కూడా తెలీదు.
ఈ మధ్య ‘వుహ్యం’ సినిమా పేరుతో ట్విట్టర్ లో హడావిడి చేశాడు వర్మ. ఇది వైసీపీ ప్రచారానికి పనికొచ్చే రాజకీయ ప్రచార చిత్రం. ఇది ఎవరో చెప్పడం కాదు వర్మే చెప్పుకున్నాడు. ఈ సినిమాకి డబ్బు సమకూర్చింది కూడా వైసీపీ నాయకులే. వర్మ, సిఎం క్యాంప్ ఆఫీస్ కి వెళ్లిమరీ స్క్రిప్ట్ తెచ్చుకున్నాడు.
ఇంత హడావిడి చేసిన తర్వాత ఈ రోజు సినిమా రిలిజైయింది. గమ్మత్తు ఏమిటంటే ఈ సినిమా విడుదలైనట్లు పాపం.. వైసీపీ ఫ్యాన్స్ కూడా తెలీదు. ఇక వృత్తి ధర్మంగా రివ్యూ రాయాల్సిన భాద్యత వున్న రివ్యూ రైటర్స్ తప్పక చూశారు. పాపం వైసీపీకి అనుకూలమైన వారు కూడా ఈ సినిమాని భరించలేకపోయారు. సినిమా చుస్తున్నంత సేపు తలలు పట్టుకున్నారు. వైసీపీ డబ్బా కొట్టే ఛానల్స్ సైతం ఈ సినిమాకి సింగిల్ స్టార్ ఇచ్చి చేతులు దులుపుకున్నాయి.
రివ్యూలు దారుణంగా వున్నాయి. రెండు గంటలు పాటు ఒక బవూన్ సినిమా చూపించాడని గొణుక్కున్నారు. పోనీ ఈ సినిమా వైసీపీకి కూడా కలిసొచ్చేలా లేదు. జగన్ ని ట్రోల్ చేసేలా వున్నాయి. ఇందులో జగన్ భారతి పాత్రలు అభివృద్ధి గురించి మాట్లాడుకునే మాటలు ఈ సినిమాలో బిగ్గెస్ట్ కామెడీ సీన్. నిజంగా ఆ సీన్ చూసినప్పుడు జగన్ భారతి పాత్రలు నవ్వులపాలయ్యాయి. సినిమాలపై వర్మ జడ్జ్మెంట్ పూర్తిగా తప్పిపోయిందని చెప్పడానికి ఇదే నిదర్శనం. నిజంగా ఈ రెండు పాత్రలని బఫూన్ క్యారెక్టర్స్ గా చిత్రీకరించాడని బాధపడుతున్నాయి వైసిపీ వర్గాలు.
సినిమా అంతా ఒక చిత్రవధలా వుందని, వర్మ తీసిన అతి చెత్త సినిమా ఇదేనని చూసిన వారి మాట. ఈ సినిమా వర్మకు తప్పితే ఎవరికీ పనికి రాలేదు. సినిమా నిర్మాణం నెపంతో తన బ్యాంక్ బ్యాలెన్స్ సరిచేసుకున్న ‘వ్యూహం’న్ని మాత్రం బాగానే అమలు చేశాడనే సెటైర్లు వైసీపీ వర్గాల్లోనే వినిపించడం కొస మెరుపు.