ఆర్జీవీ అంటే గ్యాంగ్ స్టర్ల దగ్గర నుంచి లోకల్ రౌడీల వరకూ అందరి జీవితాల్ని చూసి సినిమాలు తీసే వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇప్పుడు కేసుల్లో ఇరుక్కుని పోలీసుల నుంచి తప్పించుకోవడానికి తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. పోలీసుల విచారణకు హాజరకు కాకుండా పరారయ్యారు. మొబైల్ ఫోన్లు స్విచ్చాఫ్ చేసుకున్నారు. రెండు రోజుల కిందట కోయంబత్తూరుకు వెళ్లిన ఆయన హైదరాబాద్ తిరిగి వచ్చేశారని అనుకున్నారు. కానీ ఎక్కడున్నారో పోలీసులకు తెలియకుండా దాక్కున్నారు.
ఆయన కోసం పోలీసులు సోషల్ మీడియా అకౌంట్లు సహా అన్ని ట్రాక్ చేస్తున్నారు. పోలీసులు తల్చుకుంటే పట్టుకోవడం పెద్ద విషయం కాదు. ఆర్జీవీకి ఆ విషయం తెలియక కాదు. అయినా ఆయన పోలీసులు పట్టుకుంటే కొడతారేమోనన్న భయంతో పరారయ్యారు. సోషల్ మీడియా కేసులు అయితే అయన భయపడాల్సిన పని లేదు. విచారణకు హాజరైతే వదిలేస్తారు. కానీ ఆర్జీవీ అంతకు మించిన స్కామ్ చేశారని అందుకే భయపడుతున్నారని అంటున్నారు.
గత మార్చిలో ఆయన కంపెనీకి ఏపీ ప్రభుత్వం దాదాపుగా కోటిన్న్ర చెల్లించింది. ఆ కోటిన్నర ఎందుకు చెల్లించారో ఎవరికీ తెలియదు. ఆయన సోషల్ మీడియా పోస్టులు పెట్టినందుకే ఇచ్చారన్న అనుమానాలు ఉన్నాయి. అదే నిజం అయితే చాలా సీరియస్ కేసు అవుతుంది. అందుకే ఆర్జీవీ పరారయ్యారని.. దొరక్కుండా దాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు.