డైరక్టర్ల అసోసియేషన్ అంటూ కొంత మంది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దకు వెళ్లారు. అందులో రామ్ గోపాల్ వర్మ కూడా ఉన్నారు. రేవంత్ రెడ్డితో ఫోటో దిగి దాన్ని అన్ని మీడియాల్లో వచ్చేలా తన పీఆర్ సాయంతో చూసుకున్నారు. గతంలో ఎప్పుడైనా ఆర్జీవీ డైరక్టర్ల అసోసియేషన్ కార్యక్రమాల్లో కనిపించారా అంటే… ఆయన సొంత ఇండస్ట్రీని కించపరిచే గ్రూప్లో ఉంటారు. ఎవరైనా కలిసి పని చేస్తే కించ పరుస్తారు. మరి అలాంటిది ఎందుకు ఆర్జీవీ డైరక్టర్ల అసోసియేషన్ పేరుతో రేవంత్ వద్దకు ఎందుకు వెళ్లారు ?
ఆర్టీవీ ఎన్నికలు పూర్తయినప్పటి నుంచి తన సోషల్ మీడియా అకౌంట్ నుండి ఏపీ రాజకీయాల గురించి మాట్లాడటం మావేశారు. అంతకు ముందు అందర్నీ ఇష్టం వచ్చినట్లుగా కించ పరుస్తూ పోస్టులు పెట్టేవారు. దీని పేమెంట్ ప్రభుత్వం కోట్లలోనే ఇచ్చింది. ప్రభుత్వానికి ఏదో సర్వీస్ చేసినట్లుగా ఆయన కోట్ల పేమెంట్ తీసుకున్న విషయం బయటకు రావడం సంచలనం అయింది.
ఎన్నికల ఫలితాల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందోనన్న టెన్షన్ ఆర్జీవీలో పెరిగిపోయిందని తెలుస్తోంది. అందుకే ఇప్పుడు పది మంది మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని కాకా పట్టే ప్రయత్నం చేస్తున్నారని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితి ఆర్జీవీకి ఇబ్బందికరమే. ముందు మందు ఇంకా చాలా ఉంటుందన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.