బయోపిక్ కాకుండా రియల్ పిక్ పేరుతో రెండు పార్టుల రాజకీయ సినిమా తీయడానికి ఆర్జీవీ రెడీ అయ్యారు. ఈ విషయాన్ని ట్విట్టర్లో ప్రకటించారు. మొదటి పార్ట్ పేరు వ్యూహం. రెండో పార్ట్ పేరు శపథం అని పేరు పెట్టారు. ఇది రాజకీయ సినిమా అని చెప్పారు. అయితే బయోపిక్ కాదు.. రియల్ పిక్.. అన్నీ నిజాలే చెబుతానని చెప్పడంతో ఇది జగన్ స్టోరీ అని క్లారిటీ వచ్చేసింది. జగన్ ను కలిసి వెళ్లిన ఒక్క రోజుకే ఇలా రెండు పార్టుల సినిమా ప్రకటించడంతో రాత్రంతా కూర్చుని స్టోరీ రాసి ఉంటారని ఓ.. కొలిక్కి రావడంతో ప్రకటించి ఉంటారని భావిస్తున్నారు.
ఆర్జీవీ ప్రకటన ప్రకారం చూస్తే.. జగన్మోహన్ రెడ్డి వీరుడిలా.. ఇతరుల చేసే కుట్రలను ఎదుర్కొంటున్నట్లుగా చూపించే ఎలివేషన్లు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎప్పటికప్పుడు విక్టిమ్ కార్డు ప్రదర్శించడం సానుభూతి పొందడం జగన్ రాజకీయ చరిత్రలో కీలకం. ఈ క్రమంలో ఒక్కడిపైకి అందరూ కలిసి వస్తున్నారని చెప్పుకునేందుకు తాపత్రయ పడుతూ ఉంటారు. మరోవైపు సింహం సింగిల్ అనే ఎలివేషన్లు ఇచ్చుకుంటారు. ఇప్పుడు ఆర్జీవీ చేసిన ట్వీట్లను చూస్తే.. జగన్ పై కుట్రలు చేస్తున్నారని వాటిని ఎదుర్కొని ఆయన శపథం చేసి అధికారంలోకి వస్తారని చెబుతున్నట్లుగా ఉంది.
అయితే ఆర్జీవీ చేసిన ప్రకటనే అర్థం కానట్లుగా ఉంది. రాజకీయ కుట్రల విషం.. .రాచకురుపు పైన వేసిన కారం తో బొబ్బలెక్కిన ఆగ్రహానికి ప్రతికాష్ట అంటూ చెప్పి మొదటే బోర్ కొట్టించేసేలా చేశారు. ఆర్జీవీ ఇటీవల పూర్తిగా పోర్న్ సినిమాల వైపు వెళ్లిపోయారు. ఈ మధ్యలో వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేతలు కొండా దంపతుల జీవిత కథ కొండాను తెరకెక్కించారు. ఆ సినిమా కనీస ఇంపాక్ట్ చూపించలేకపోయింది. ధియేటర్లలో విడుదల చేసుకోలేకపోయారు. విడుదలైందో లేదో కూడా ఎవరికీ తెలియదు. కానీ ప్రమోషన్లు మాత్రం చేశారు. ఆర్జీవీ టోటల్‌గా తన సినిమాలను పోర్న్ లెవన్ కంటెంట్ వైపు మార్చేసిన తర్వాత ఆయన తీసే సీరియస్ సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గిపోయింది. అయినప్పటికీ సీఎం జగన్ ఆర్జీవీపై నమ్మకంతో కీలక బాధ్యతలిచ్చారు.ఈ బయోపిక్‌ను ఆర్జీవీ తన ట్విట్ల తరహాలో అర్థం కాకుండా తీస్తారో..డబ్బులు ఖర్చు పెట్టేసి సరిపెడతారో చూడాలి.
ఈ చిత్రం 2 పార్ట్స్ గా రాబోతుంది .. మొదటి పార్ట్ “వ్యూహం” ,2nd పార్ట్ “శపథం” .. రెండింటిలోనూ రాజకీయఆరాచకీయాలు పుష్కలంగా వుంటాయి.
రాష్ట్ర ప్రజలు మొదటి చిత్రం “వ్యూహం “ షాక్ నుంచి తెరుకునే లోపే వాళ్ళకి ఇంకో ఎలెక్ట్రిక్ షాక్ , పార్ట్ 2 “శపథం “ లో తగులుతుంది .
— Ram Gopal Varma (@RGVzoomin) October 27, 2022