రామ్ గోపా వర్మ సినిమాలు ఇప్పుడంతగా ప్రేక్షకులకు నప్పడం లేదు కానీ ఆయన మాటలు మాత్రం ఎప్పుడూ ఆసక్తిగానే వుంటాయి. సెటైర్లు, సెన్స్ అఫ్ హ్యుమర్ తో ఎప్పుడూ వార్తల్లోనే వుంటారు వర్మ. ఇప్పుడు ఆయన పాన్ ఇండియా సినిమాపై వేసిన సెటైర్లు ఆసక్తికరంగా వున్నాయి. తెలుగు సినిమా పాన్ ఇండియాకి వెళ్ళడంపై తన అభిప్రాయం చెప్పారు వర్మ.
”తెలుగు సినిమా పాన్ ఇండియాకి పాకడం అనేది ఒట్టి ట్రాష్. ఏడాది రెండు వందలు సినిమాలు తీస్తే అందులో ఒక సినిమా హిందీతో పాటు మిగతా భాషల్లో కాస్త ఆడింది. ఈ మాత్రానికి తెలుగు సినిమాలని పాన్ ఇండియా సినిమాలని అనాల్సిన అవసరం లేదు. రాజమౌళి, సుకుమార్, ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా సినిమాలు తీశారంతే.ఇక్కడ తెలుగు సినిమానో, సౌత్ సినిమానో పాన్ ఇండియా అయిపోలేదు. హాలీవుడ్ లో ప్రపంచవ్యాప్తంగా చూసే సినిమాలు తీస్తారు. అంతమాత్రాన పాన్ వరల్డ్, పాన్ గ్లోబ్ సినిమా అని వేసుకోవడం లేదు కదా. ఏదైనా మేకర్ ని బట్టే వుంటుంది కానీ ఇండస్ట్రీ ప్రకారం వుండదు” అని చెప్పుకొచ్చారు వర్మ.