రామ్ గోపాల్ వర్మ ఏది మాట్లాడిన అందులో సంచలనం, వివాదం వుండేలా జాగ్రత్తపడతాడు. ఆయన సినిమాలు తీయడం మానేసి చాలా కాలమైనప్పటికీ ఆయన్ని ఇంకా వార్తల్లో వుంచేది ఈ సంచలనాలే. అయితే ఆయన మాటలు రానురాను మరీ రోత పుట్టిస్తున్నాయి. సమయం సందర్భం లేకుండా ఎప్పుడూ ఒకటే ధ్యాసగా ఆయన చేస్తున్న కామెంట్స్ కంపరం పుట్టిస్తున్నాయి. తాజాగా గుంటూరు ఆచార్య నాగార్జున వర్సిటీలో జరిగిన అకాడమిక్ ఎగ్జిబిషన్ 2023 ఈ వెంట్‌కు వర్మ ముఖ్య అతిథిగా వెళ్ళాడు వర్మ.
వర్సిటీలో ప్రసంగంలో కూడా వర్మ వరస మారలేదు. తినండి, తాగండి, ఎంజాయ్ చేయండి.నేను చనిపోయాక స్వర్గానికి వెళ్తే అక్కడ రంభ, ఊర్వశీలు ఉండకపోవచ్చు. అందుకే ఆ చాన్స్ తీసుకోకుండ ఇక్కడే అన్ని అనుభవించేస్తా. రంభ, ఊర్వశీ, మేనకలతో తిరిగినప్పుడే మోక్షం కలుగుతుంది. వైరస్ వచ్చి తాను తప్ప మగజాతి అంతా పోవాలి’’ ఇలా సాగింది వర్మ ప్రసంగం. వర్మ వ్యాఖ్యలకు అక్కడే వున్నా మహిళా లెక్చరర్లు, విద్యార్ధులు సిగ్గుతో తల దించుకున్నారు.
అసలు ఇలాంటి వేడుకలకు రామ్ గోపాల్ వర్మ లాంటి పర్వర్ట్ ని ఎవరు ఆహ్వానించారు ? నిర్వాహకులకు మతిపోయిందా? అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. రామ్ గోపాల్ వర్మ ని క్రియేటీవ్ జీనియస్ అనే కోవలో చేర్చి ఈ వేడుకకు పిలిచారు నిర్వాహకులు. వేడుకలో ఆయన చెప్పిన మాటలు విని నిర్వాహకులు కూడా విస్తుపోయారు. రామ్ గోపాల్ వర్మ ఈ కామెంట్స్ చేయడం ఇదే తొలిసారి కాదు. అనేక సార్లు యూట్యూబ్ ఇంటర్వ్యూ లు, పేస్ బుక్, ట్విట్టర్ లలో ఇదే వాగుడు వాగాడు వర్మ. ఇప్పుడు యూనివర్శిటీ విద్యార్ధుల ముందుకు కూడా అరిగిపోయిన రికార్డ్ లా పిచ్చి వాగుడు వాగి తన దిగజారుడుతనానికి హద్దే లేదని నిరూపించుకున్నాడు.