సంచలనానికి మారు పేరైన వర్మ కిల్లింగ్ వీరప్పన్ సినిమా తర్వాత ముంబై వెళ్తున్నట్టు ప్రకటించాడు. ఏదైన విషయాన్ని వివాదం రేపేలా చేప్పే వర్మ తను వెళ్లిపోతున్న విషయాన్ని కూడా వ్యగ్యంగా చెప్పుకొచ్చాడు. ముంబైకి వెళ్తున్న వర్మ ఇక నుండి పూరి జగన్నాథ్, అమ్మ, కె.సి.ఆర్, ఇంకా మెగా ఫ్యామిలీపై తన ట్వీట్స్ మిస్ అవుతున్నానని అన్నారు.
ప్రస్తుతం కిల్లింగ్ వీరప్పన్ సినిమా రిలీజ్ కోసం ఎదురు చూస్తున్న వర్మ రీసెంట్ గా ఆ సినిమా గురించి వదిలిన ట్రైలర్ తో అదరి మన్నలను పొందాడు. కిల్లింగ్ వీరప్పన్ ట్రైలర్ చూసి బిగ్ బి అమితాబచ్చన్ వర్మకి ఫోన్ చేసి మరి సినిమా గురించి అడిగి తెలుసుకున్నాడట. సో చాలా కాలంగా సకెస్ కోసం ఎదురుచూస్తున్న వర్మకి కిల్లింగ్ వీరప్పన్ కమర్షియల్ సక్సెస్ ని ఇస్తుందని భావిస్తున్నాడు.
ఇక ఓ వైపు తను ముంబై వెళ్తున్నా అని చెప్పడంతో మెగా ఫ్యాన్స్ అంతా హమ్మయ్య అనుకుంటున్నారని టాక్. ఏది ఏమైనా కొద్దిరోజులు టాలీవుడ్ సినిమాల మీద తన మార్క్ సెటైర్స్ వేస్తూ విశ్లేషించిన వర్మ మళ్లెప్పుడు టాలీవుడ్ కి వస్తాడో మరి.