రామ్‌గోపాల్ వర్మ పూర్తిగా.. రాజకీయ ట్రాక్‌లోకి వచ్చేశారు. ఆయనకు రాజకీయం వంట బట్టేసింది. కేసీఆర్ బయోపిక్ తీస్తానంటూ… ఓ పోస్టర్ రిలీజ్ చేసి… ఆంధ్రులను బూతులు తిడుతూ.. ఓ పాట రిలీజ్ చేశారు. కేసీఆర్ బయోపిక్ తాను మాత్రమే తీయగలనంటూ.. కాస్త హడావుడి చేశారు ఇప్పుడు… లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను.. ఏపీలో రిలీజ్ చేసుకోవడానికి ప్రస్తుతం తంటాలు పడుతున్నారు. ఈ నెల 31వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఎన్నికలు ముగిసి ఫలితాలు రావడంతో… ఆ సినిమాపై క్రేజ్ పోయింది. పైగా.. ఇప్పటికే.. ఏపీ మినహా ఇతర చోట్ల విడుదలయింది. స్వయంగా సినిమాకు సంబంధించిన వ్యక్తులే… సోషల్ మీడియాలో వర్జినల్ ప్రింట్లు సర్క్యూలేట్ చేశారనే ప్రచారమూ జరిగింది.
అయితే …ఆ సినిమా నుంచి ఇంకా పబ్లిసిటీ రాబట్టుకునేందుకు ఆర్జీవీ ఏ మాత్రం వెనుకాడటం లేదు. తాజాగా.. గతంలో ఆయన… విజయవాడలోని… నడిరోడ్డు మీద ప్రెస్ మీట్ పెడతానని హడావుడి చేశారు. అప్పుడు పోలీసులు వెనక్కి పంపేశారు. మరోసారి ఫలితాలు వచ్చిన తర్వాత అలాంటి ప్రయత్నమే చేశారు. కానీ పోలీసులు వార్నింగ్ ఇవ్వడంతో.. ప్రైవేటు ప్లేస్‌లో… ప్రెస్‌మీట్ పెట్టి.. రాజకీయ ప్రసంగం చేశారు. అందులోనే.. “కమ్మ రాజ్యంలో కడప రెడ్లు” అనే సినిమాను ప్రకటించారు. సినిమాను తీస్తారో… చాలా సినిమాల్ోల ప్రకటనలకే పరిమితం చేస్తారో కానీ… టైటిల్ మాత్రం ఆసక్తికరంగానే ఉంది. ఏపీలో ప్రస్తుతం ఉన్న కులవిభజన కారణంగా… ఆర్జీవీ… ఈ ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఆర్జీవీ.. గతంలో రాజకీయాలపై పెద్దగా మాట్లాడేవారు కాదు. కానీ ఇప్పుడు మాత్రం… పక్కా వైసీపీ నేతల్లా మాట్లాడుతున్నారు. సైకిల్ టైరుకు పంక్చర్ అయిందంటున్నారు. హామీలు అమలు చేయకపోవడం వల్లే.. చంద్రబాబు ఓడిపోయారంటున్నారు. అలాగే… జనసేనతో పోలిస్తే పీఆర్పీ బాహుబలి అనే కామెంట్లు కూడా చేస్తున్నారు. జనసేనకు ఒక్క సీటే రావడం… పీఆర్పీకి పద్దెనిమిది సీట్లు రావడంపై… ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.