రామ్ కథానాయకుడిగా – లింగు స్వామి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఇటీవలే ఈ చిత్రానికి అధికారికంగా క్లాప్ కొట్టారు. ఈవారంలో రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. ఇందులో రామ్ పోలీస్ అధికారికగా కనిపించనున్నాడన్న విషయం తెలుగు 360 ముందే చెప్పింది. ఇప్పుడు..టైటిల్ విషయంలోనూ క్లూ లాగింది.
ఈ చిత్రానికి `ఉస్తాద్` అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. దాదాపుగా ఇదే ఖరారు చేసే అవకాశం ఉంది. రామ్ కెరీర్లోనే `ఇస్మార్ట్ శంకర్` అతి పెద్ద హిట్టు. అందులో.. రామ్ `ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్…` అంటూ తన గురించి తాను చెప్పుకుంటాడు. అందులోని ఉస్తాద్ నే ఇప్పుడు టైటిల్ గా మార్చుకున్నాడు రామ్. ఈ సినిమాకి `ఉస్తాద్` అనే టైటిల్ సూచించింది కూడా రామ్ నే అని సమాచారం. త్వరలోనే… ఈ టైటిల్ ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.