ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో బీజేపీ గెలుపు ఖాయమట. ఈ మాట చెప్పిది.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్. అంటే.. రెండు రాష్ట్రాల్లో ఓడిపోతున్నామన్నామని ఒప్పేసుకున్నారా..?. ప్రస్తుతం రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, తెలంగాణ, మిజోరంలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇవి వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావిస్తున్నారు. ఐదు రాష్ట్రాల్లోనూ గెలిచేస్తామని.. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఫుల్ కాన్ఫిడెన్స్ చూపిస్తున్నారు. కానీ సర్వేలు మాత్రం.. అటూఇటుగా వస్తున్నాయి. బీజేపీకి ఫేవర్ గా ఉండే చానళ్లలో బీజేపీకి అనుకూలంగా వస్తున్నాయి. మిగిలిన వాటిల్లో గట్టి పోటీ జరుగుతుందన్నట్లుగా వస్తున్నారు. సర్వే విషయాలను పక్కన పెడితే.. ఆయా రాష్ట్రాల్లో చురుగ్గా చురుగ్గా ప్రచారంలో పాల్గొంటున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా .. కచ్చితంగా గెలిచేయబోతున్నామన్నంత కాన్ఫిడెన్స్ చూపిస్తున్నారు. ఎన్నికలు రాష్ట్రాల్లో చాలా రోజులుగా రామ్ మాధవ్ కూడా.. బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు.
అయినా రామ్‌మాధవ్ ఆ మాత్రం కాన్ఫిడెన్స్ చూపించకపోవడం… బీజేపీ వర్గాలనే ఆశ్చర్యపరుస్తోంది. మూడు రోజుల క్రితం… అమిత్ షా మిజోరం వెళ్లి.. దీపావళి పండుగ… బీజేపీ ప్రభుత్వంలోనే చేసుకుందామంటూ పిలుపునిచ్చి వచ్చారు. నిజానికి మిజోరం చాలా చిన్న రాష్ట్రామే… అయినా సరే.. ఆ రాష్ట్రాన్ని బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అక్కడ గత ఎన్నికల్లో అర శాతం ఓట్లు వచ్చినా సరే ఈ సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని… అమిత్ షా చెబుతున్నారు. ఇక తెలంగాణలోనూ.. అంతే చెబుతున్నారు. తెలంగాణ విషయంలో రామ్ మాధవ్ మరింత కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. 70 ప్లస్ సీట్లు సాధిస్తామని చెప్పుకొచ్చారు కూడా. ఇప్పుడు ఐదు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాలను మైనస్ చేస్తున్నారు. అంటే.. రాజస్థాన్, తెలంగాణ లేకపోతే..మిజోరంలలో ఓడిపోబోతోతున్నామని డిక్లేర్ చేశేశారా..?
నిజానికి ఏ రాజకీయ పార్టీ నేత కూడా ఎన్నికల ముందు… తమ ఓటమిని ప్రిడెక్ట్ చేయనే చేయరు. ఓటమికి సంబంధించి స్పష్టమైన నివేదికలు ఉన్నపప్పటికీ.. విజయం కోసం.. చివరి వరకూ పోరాడతారు. ఓడిపోయిన తర్వాత కూడా.. ఏవో కారణాలు చెప్పుకోడవానికి ప్రయత్నిస్తారు. కానీ.. బీజేపీ ఎన్నికల వ్యూహాల్లో అత్యంత కీలక పాత్ర పోషించే రామ్ మాధవ్.. రెండు రాష్ట్రాల్లో రేసులో లేమని చెప్పుకోవడంతో… బీజేపీ… ముందుగానే చేతులెత్తేసిందన్న భావన వచ్చేస్తోంది. ఇప్పుడే ఇలా ఉంటే.. మరి రాను రాను మిగతా మూడు రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో..?