ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన తొలినాళ్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్నట్టుగా ఇప్పుడు ఇంప్రెస్ చేయలేకపోతున్నాడు. సినిమాలైతే వరుసెంట చేస్తున్నాడు కాని అన్ని సినిమాలు ఫ్లాప్ బాట పడుతున్నాయి. అందుకే ఇక చేయబోయే సినిమాలకు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. రీసెంట్ రిలీజ్ శివమ్ రామ్ కెరియర్లోనే వరస్ట్ మూవీ కాగా అంతకుముందు పండుగ చేస్కో కాస్త పర్వాలేదనిపించింది.
ప్రస్తుతం రామ్ చేస్తున్న సినిమా హరికథ. అయితే ఆ కథకు తగ్గట్టుగా సినిమా టైటిల్ ని చేంజ్ చేద్దామని అనుకుంటున్నారట. హరికథ అంటే ఆడియెన్స్ మళ్లీ తిప్పికొడతారేమో అన్న భయం పట్టుకున్న రామ్ సినిమా టైటిల్ ని ‘నేను శైలజ’గా మార్చాడట. అఫిషియల్ గా న్యూస్ ఎనౌన్స్ చేయాల్సి ఉంది. రచయితగా పలు సినిమాలకు పనిచేసిన కిశోర్ తిరుమల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
మలయాళ హీరోయిన్ కీర్తి సురేష్ సినిమాలో రామ్ సరసన నటిస్తుంది. తెలుగులో మొదటి సినిమా చేస్తున్న కీర్తి ఈ సినిమా హిట్ కొట్టి ఇక్కడ స్టార్ హీరోయిన్ అవ్వాలని ఆశ పడుతుంది. ఆల్రెడీ మలయాళంలో అమ్మడికి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. అంతేకాదు తన సినిమాకు ఆ లక్కీ హీరోయిన్ కూడా తోడైంది కాబట్టి సినిమా హిట్టు కొడుతుందని భావిస్తున్నాడు రామ్. మరి రామ్ చేస్తున్న ఈ మ్యాజిక్కులన్ని ఫలించి సినిమా హిట్ కొట్టాలనే కోరుకుంటున్నారు సిని ప్రియులు