రామ్ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతోందని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. కొత్త దర్శకులతో ప్రయాణం చేసే రామ్.. అసలు ఏమాత్రం హిట్లు లేని పూరితో సినిమా చేస్తాడా? అంటూ కొంతమంది అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే.. ఇప్పుడు అఫీషియల్ ప్రకటన వచ్చేసింది. రామ్‌తో పూరి సినిమా ఖాయమైంది. పూరీ టూరింగ్ టాకీస్ పై ఈ సినిమా తెరకెక్కనుంది. జనవరిలో షూటింగ్ ప్రారంభిస్తారు. మేలో ఈ సినిమాని విడుదల చేస్తారు. ఇటీవల రామ్ తన హెయిర్ స్టైల్‌ని విభిన్నంగా మార్చుకున్నాడు. అది పూరి సినిమా కోసమే. ఈ చిత్రంలో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో ప్రకటిస్తారు.