యంగ్ ఎనర్జిటిక్ హీరో, ‘సినిమా చూపిస్త మావ’, ‘నేను లోకల్’ సిన్మాల డైరెక్టర్ త్రినాధరావు నక్కిన కాంబినేషన్లో దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా ఈరోజు ఉదయం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ కార్యాలయంలో పూజతో ప్రారంభమైంది. ఈ సినిమాకి ‘హలో గురూ ప్రేమ కోసమే’ టైటిల్ కన్ఫర్మ్ చేశారు. హీరోగా రామ్కి 16 చిత్రమిది. ఇందులో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. సోమవారం నుంచి హైదరాబాద్లో రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. టాకీ పార్ట్ షూటింగ్ అంతా సిటీలో చేసేలా ప్లాన్ చేశారు. బయట సిటీల్లో ఎక్కువ షూటింగ్ పెట్టుకోలేదట. హీరో హీరోయిన్లు తప్ప ‘నేను లోకల్’ సినిమాకు వర్క్ చేసిన టెక్నికల్ టీమ్ అంతా ఈ సినిమాకు వర్క్ చేస్తున్నారు. కథ, సినిమా ట్రీట్మెంట్ అంతా వినోదాత్మకంగా వుంటుందని తెలుస్తోంది.
అఖిల్ రెండో సినిమా ‘హలో’కి టైటిల్ కన్ఫర్మ్ చేయకముందు ‘హలో గురూ ప్రేమ కోసమే’ ఎక్కువ వినిపించింది. కింగ్ అక్కినేని నాగార్జున, అమల జంటగా నటించిన ‘నిర్ణయం’ సినిమాలో పాట కావడంతో అఖిల్ సినిమాకు ఆ టైటిల్ పెడతారని అనుకున్నారంతా. చివరకు, రామ్ సినిమాకు కుదిరింది.