రవితేజ ఈ మద్య రూటు మార్చాడు. ఏ సినిమా పడితే ఆ సినిమా ఒప్పుకోవడం లేదు. ఒకవేళ దర్శకుడికి మాటిచ్చినా కథ విషయంలో రాజీ పడడం లేదు. కథ, తన క్యారెక్టర్, అన్నింటికీ మించి పారితోషికం ఓకే అయితేనే ఆ సినిమాని పట్టాలెక్కిస్తున్నాడు. ఈమధ్య కందిరీగ దర్శకుడు సంతోష్ శ్రీన్వాస్ రవితేజ కోసం ఓ స్ర్కిప్టు తయారు చేశాడు. ఆ లైన్ రవితేజకీ బాగా నచ్చేసింది. దాంతో సినిమా ఓకే అయిపోయిందని సంబర పడ్డాడు. ఆ లైన్‌ని స్ర్కిప్టుగా మలచడంలో శ్రీన్వాస్ విఫలమయ్యాడట. స్ర్కిప్టులో కొన్ని సందేహాలు ఉండడంతో రవితేజ ఈ సినిమాని పక్కన పెట్టేశాడట. రవితేజ కోసం ఆర్నెళ్లు తిరిగిన సంతోష్.. ఇక చేసేది లేక రామ్ దగ్గరకు వెళ్లాడట.
రవితేజ ఏ కథనైతే తిరస్కరించాడో, అదే కథ రామ్‌కి తెగ నచ్చేయడంతో… వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా రావడం ఖాయమైపోయిందని ఫిల్మ్‌నగర్ వర్గాల టాక్. నేను – శైలజతో ఓ హిట్టు కొట్టి కాస్త కాన్ఫిడెన్స్ తెచ్చుకొన్న రామ్… ఇప్పుడు కందిరీగతో తనకు ఓ కమర్షియల్ హిట్ అందించిన సంతోష్‌తో జట్టు కట్టడానికి రెడీ అయ్యాడు. మరి ఈ కథని తిరస్కరించి రవితేజ మంచి పని చేశాడా, లేదంటే రామ్ పప్పులో కాలేశాడా..? ఈ విషయాలు తేలాలంటే మాత్రం.. ఈసినిమా పట్టాలెక్కాలి.. రిలీజ్ కావాలి. దానికి ఓ ఏడాదైనా పట్టొచ్చు.