బోయపాటి శ్రీను, రామ్ పోతినేని కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ రోజు రామ్ పుట్టిన రోజు కానుకగా ఫస్ట్ థండర్ పేరుతో ఒక గ్లింప్స్ విడుదల చేశారు. బోయపాటి స్టయిల్ లో ఒక ఇంట్రో డైలాగు, భారీ యాక్షన్ సీన్.. గ్లింప్స్ లో చూపించారు.
”నీ స్టేట్ దాటలేనని అన్నావ్ .. దాట
నీ గెట్ దాటలేనని అన్నావ్ .. దాట
నీ పవర్ దాటలేనని అన్నావ్.. దాట
ఇంకేటి దాటేది నా బొంగులో లిమిట్స్” ఇదీ రామ్ ఇంట్రో డైలాగ్.
తర్వాత బోయపాటి స్టయిల్ లో మాస్ యాక్షన్ సీక్వెన్స్ తెరపైకి వచ్చింది. రామ్ మాస్ యాక్షన్ చేశాడు. గ్లింప్స్ లో శ్రీలీల ఒక ఫ్రేం లో కనిపించింది. తమన్ ఇచ్చిన బీజీఏం హెవీగా వుంది. ఇది బోయపాటి మార్క్ యాక్షన్ సినిమా అనే క్లారిటీ ఇచ్చింది ఫస్ట్ థండర్. దసరా కి సినిమా విడుదల కానుంది.