రామ్ – లింగు స్వామి కాంబినేషన్ లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ తరవాత… ఈ సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్తారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తారు. ఈ చిత్రం ఫ్యాక్షన్ నేపథ్యంలో సాగుతుందని తెలుగు 360 ముందే చెప్పింది. ఇప్పుడు మరో అప్ డేట్ ని తీసుకొచ్చింది.
ఇందులో రామ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడని సమాచారం. రామ్ ఇప్పటి వరకూ ఈతరం కుర్రాడి తరహా పాత్రల్లో కనిపించాడు. ఖాకీ కట్టడం ఇదే తొలిసారి. సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే… రామ్ లింగుస్వామికి ఓకే చెప్పేశాడట. పోలీస్ కథే అయినా… కథలో ట్విస్టులు చాలా ఆసక్తికరంగా ఉంటాయని, ఓ కొత్త తరహా సినిమాని తెరపై చూసిన ఫీలింగ్ ప్రేక్షకులలో కలుగుతుందని తెలుస్తోంది. కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. ప్రతినాయకుడి పాత్రకు బాగా పేరున్న ఓ నటుడ్ని తీసుకుంటారని సమాచారం. త్వరలోనే ఆ వివరాలూ బయటకు వస్తాయి.