గౌతమ్ మీనన్ లవ్ స్టోరీలకు అడ్డా. ఆయన యాక్షన్ సినిమాలూ చేశాడు గానీ, లవ్ స్టోరీ తీస్తే నెక్ట్స్ లెవల్. అందుకే యంగ్ హీరోలంతా.. ఆయనతో పనిచేయడానికి ఉత్సాహం చూపిస్తుంటారు. అందులోనూ గౌతమ్ మీనన్‌తో లవ్ స్టోరీ తీస్తే… యూత్ కి ఇంకాస్త దగ్గర కావొచ్చని ఆశ పడుతుంటారు. రామ్ కి కూడా గౌతమ్ మీనన్‌తో సినిమా చేయాలని ఆశ. ఆ కోరిక ఇప్పటికి తీరుతోంది. అవును.. రామ్, గౌతమ్ మీనన్ కాంబినేషన్లో ఓ సినిమా ఓకే అయ్యిందని టాక్. ఇటీవల రామ్, గౌతమ్ మీనన్ మధ్య కథా చర్చలు జరిగాయని, ఇద్దరూ సినిమా చేయడానికి ఓ అంగీకారానికి వచ్చారని టాక్. రామ్ ఈమధ్య తమిళ మార్కెట్ పై దృష్టి పెట్టాడు. లింగుస్వామితో.. ‘వారియర్’ సినిమా చేస్తోంది అందుకే. ఆ సినిమా తెలుగుతో పాటు తమిళంలోనూ విడుదల కానుంది. ఇప్పుడు గౌతమ్ మీనన్ రూపంలో మరో తమిళ దర్శకుడికి అవకాశం ఇచ్చినట్టైంది. వారియర్ అయిన వెంటనే బోయపాటి శ్రీను సినిమాని పట్టాలెక్కిస్తాడు రామ్. ఆ తరవాతే గౌతమ్ మీనన్ సినిమా ఉంటుంది. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.