రామ్ పోతినేని హీరోగా ఓ సినిమా శర వేగంగా షూటింగ్ జరుపుకొంటోంది. మహేష్‌బాబు పి దర్శకుడు. మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రం కోసం ‘ఆంధ్రా కింగ్ తాలుకా’ అనే పేరు పరిశీలనలో వుంది. ఇందులో రామ్ లుక్ చాలా ఫ్రెష్‌గా ఉంది. ఇటీవల రాజమండ్రిలో ఓ షెడ్యూల్ పూర్తి చేశారు. త్వరలోనే హైదరాబాద్‌లో మరో దఫా షూటింగ్ మొదలు కానుంది.
ఈ సినిమా కథ గురించి కానీ, హీరో పాత్ర గురించి కానీ ప్రస్తుతానికి చిత్రబృందం ఎలాంటి క్లూ ఇవ్వలేదు. కాకపోతే… ఇదో పిరియాడిక్ డ్రామా అని తెలుస్తోంది. ఓ మారుమూల ప్రాంతం కరెంటుకు నోచుకోలేదట. ఆ ప్రాంతానికి కరెంట్ తీసుకురావడానికి హీరో ఏం చేశాడన్నది కథ అని సమాచారం. మాస్, యాక్షన్, హీరోయిజం, వీటి మధ్యలో ఓ లవ్ స్టోరీతో పాటు మంచి మెసేజ్ కూడా ఈ సినిమాతో ఇవ్వబోతున్నారని ఇన్ సైడ్ వర్గాల టాక్.
‘మిస్టర్ బచ్చన్’ ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తోంది. మురశీ శర్మ, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రధారులు. ఈ చిత్రానికి వివేక్ – మెర్విన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. త్వరలోనే టైటిల్ ని అధికారికంగా ప్రకటిస్తారు.