యాక్షన్ కథలకు కేరాఫ్‌గా నిలిచిన గోపీచంద్ కొన్ని మంచి హిట్లు కొట్టాడు. అయితే… కొంతకాలంగా గోపీ గ్రాఫ్ బాలేదు. మంచి కాంబినేషన్లు, బ్యానర్లు పడుతున్నా హిట్ కొట్టలేకపోతున్నాడు. గౌతమ్ నందాలాంటి మంచి కథలు సైతం.. మిస్ ఫైర్ అయ్యాయి. ఇలాంటి దశలో తనని తాను నిరూపించుకోవాల్సిన అసవరం గోపీకి ఎంతైనా ఉంది. మే 5న తన `రామబాణం` దూసుకొస్తోంది. గోపీ కెరీర్‌కి.. ఈ సినిమా అసలైన పరీక్ష పెట్టబోతోంది.
తనకు రెండు హిట్లు ఇచ్చిన శ్రీవాస్ లాంటి దర్శకుడు, ఖుష్బూ.. గోపీచంద్‌లాంటి తారాగణం, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ లాంటి మంచి బ్యానర్… ఇవన్నీ ఈసారి గోపీచంద్‌కి కలిసొస్తున్నాయి. పైగా ఇది సమ్మర్ సీజన్. ప్రేక్షకులకు ఇప్పుడో మంచి సినిమా కావాలి. సినిమా నచ్చితే… దాన్ని ఏ స్థాయిలో తీసుకెళ్తారో చెప్పడానికి విరూపాక్ష రూపంలో మంచి ఉదాహరణ ఉంది. పైగా బాక్సాఫీసు దగ్గర సినిమాలేం లేవు. గోపీచంద్ కి ఇదే మంచి టైమ్. ఈసారి సినిమా పోతే.. సాకులు చెప్పడానికి ఏం లేదు. తనని చూడ్డానికి ప్రేక్షకులు టికెట్ కొనుక్కొని వస్తారా, రారా? అనేది రామబాణంతో డిసైడ్ అయిపోతుంది. అందుకే ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందా అని ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా ఈగర్‌గా ఎదురు చూస్తోంది. గోపీచంద్ తో సహా.