ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ. లక్షలు ఇస్తూ పదుల సంఖ్య సలహాదారుల్ని పెట్టుకుంది. ఠంచన్‌గా వారికి జీతాలు ఇస్తోంది. అయితే.. వారి దగ్గర నుంచి ఎలాంటి సలహాలు ఆశించడం లేదు. చొరవగా ఎవరైనా సలహాలు ఇవ్వబోతే.. అసలు పట్టించుకోవడం లేదు. చాలా మంది సలహాదారులు సైలెంట్‌గానే ఉన్నారు కానీ.. “పేరు మోసిన” కొంత మంది మాత్రం.. తమను ఖాళీగా కూర్చోబెట్టడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే.. తాము వైదొలుగుతామని.. ప్రభుత్వ పెద్దలకు సమాచారం పంపుతున్నారు. ఇలాంటి వారిలో… సీనియర్ జర్నలిస్ట్ రామచంద్రమూర్తి పేరు బయటకు వచ్చింది. సాక్షిలో ఎడిటోరియల్ డైరక్టర్‌గా ఉండే రామచంద్రమూర్తిని .. వైసీపీ గెలిచిన తర్వాత తప్పించారు. సాక్షిలో ఇచ్చిన దాని కన్నా రెట్టింపు జీతం ఇచ్చి పబ్లిక్ పాలసీస్ సలహాదారుగా నియమించారు.
కేబినెట్ హోదా ఇచ్చారు. అయితే అప్పటి నుంచి జీతం అందుతోంది కానీ.. చేయడానికి పని మాత్రం దొరకడం లేదు. పబ్లిక్ పాలసీస్ విషయంలో సలహాదారుగా తనకు పదవి ఇచ్చినప్పటికీ.. ఇప్పటి వరకూ తనను ఒక్క సలహా అడగలేదని..తాను చొరవ తీసుకుని.. ఇవ్వాలని ప్రయత్నించినా పట్టించుకోవడం లేదని రామచంద్రమూర్తి ఫీలవుతున్నారని అంటున్నారు. తనకు విలువ లేని చోట.. తనకు జీతం ఇచ్చినా ఉండాలనుకోవడం లేదని.. ఆయన ప్రభుత్వ పెద్దలకు సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వ పెద్దలు ఏ నిర్ణయం తీసుకున్నారో తెలియదు కానీ… రామచంద్రమూర్తి వైదొలగాలని అనుకుంటున్నట్లుగా.. బయటకు మాత్రం సమాచారం లీక్ చేశారు.
రామచంద్రమూర్తి.. వివాదాస్పద అంశాల్లో ప్రభుత్వాన్ని డిఫెండ్ చేయడానికి ఈ మధ్యకాలంలో ప్రయత్నించారు. ముఖ్యంగా మీడియాపై కేసులు పెట్టే జీవో విషయంలో ఆయన ఆంధ్రజ్యోతితో మీడియా ముఖంగా వాగ్వాదానికి దిగారు. మీడియా స్వేచ్ఛపై గతంలో ఆయన రాసిన వ్యాఖ్యలకు విరుద్ధంగా ప్రకటనలు చేయడంతో… సుదీర్ఘ కాలంగా సీనియర్ జర్నలిస్టుగా ఆయన తెచ్చి పెట్టుకున్న ఇమేజ్‌కు మచ్చ పడిందన్న అభిప్రాయం సోషల్ మీడియాలో వ్యక్తమయింది.