ఎన్నికలకు ముందు.. తెలుగుదేశం పార్టీ సర్కార్ పై పింక్ డైమండ్ ఆరోపణలు చేసి.. ప్రధానార్చకులుగా .. బలవంతంగా రిటైర్మెంట్ అయిపోయిన శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులకు.. కొత్త ప్రభుత్వం వచ్చిన ఏడు నెలల తర్వాత మరోసారి పదవి లభించింది. న్యాయవివాదాల దృష్ట్యా ఆయనకు ప్రధాన అర్చక పదవి ఇవ్వడం సాధ్యం కాబట్టి.. గౌరవ ప్రధాన అర్చకులు అనే పదవిని టీటీడీ పాలక మండలి సృష్టించింది. ఆ పదవిలో రమణదీక్షితులను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలోకి మళ్లీ ప్రధాన అర్చకునిగా అడుగు పెట్టాలనుకున్న రమణదీక్షితుల కోరిక.. ఏడు నెలల తర్వాత తీరుతోంది. ఆయనను.. ఏ పదవిలోకి తీసుకోవడం సాధ్యం కాదని.. టీటీడీ బోర్డు చాలా కాలంగా చెబుతూ వస్తోంది. ఆయన చేసిన వివాదాలు.. వేసిన కేసుల కారణంగా. సమస్యలు ఉంటాయని చెప్పుకొచ్చింది.
అయితే.. జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు.. ఆయనను మళ్లీ ప్రధాన అర్చకుని పదవిలో నియమిస్తామని హామీ ఇచ్చారు. జగన్ గెలిచిన తర్వాత పలుమార్లు రమణదీక్షితులు.. ఆయనను కలిసి తనకు ఇచ్చిన హామీ గురించి ప్రస్తావించారు. కానీ సాంకేతికంగా మళ్లీ. ప్రధాన అర్చకుని హోదాలో తీసుకోవడం సాధ్యం కాదని.. చెప్పి.. ఆగమ సలహాదారు పదవి తీసుకోవాలని సూచించారు. తర్వాత గౌరవ ప్రధానార్చకుని పదవి సృష్టించి ఇస్తామని హామీ ఇచ్చారు. కొద్ది రోజుల కిందట..ఆగమసలహాదారుగా పదవి చేపట్టారు. ఇప్పుడు గౌరవ ప్రధాన అర్చకులుగా నియమితులయ్యారు. ఇప్పటికే. తన కుమారులు ఇద్దర్ని.. తిరుమల ఆలయానికి బదిలీ చేయించుకున్నారు.
ఆయన కుమారులు.. వెంకటకుమార దీక్షితులు, రాజేష్ దీక్షితులు వంశపారంపర్య అర్చకత్వం ప్లస్ పాయింట్‌తో.. టీటీడీలో చేరారు. అయితే.. వారు విధులకు హాజరు కావడం లేదు. ఇప్పటికే ఆయన బద్ద విరోధిగా భావించే డాలర్ శేషాద్రి. మరో సారి పొడిగింపు తెచ్చుకున్నారు. రిటైరైన ఉద్యోగులందర్నీ తీసేసినా.. డాలర్ శేషాద్రిని మాత్రం తొలగించలేకపోయారు. ఆలయంలో.. మళ్లీ రెండు వర్గాల పోరాటం ప్రారంభమవుతుందన్న ఆందోళన.. టీటీడీలో కనిపిస్తోంది.