రమణదీక్షితులు రాజకీయంలో పావుగా మారి తన పదవిని పోగొట్టుకుని ఐదేళ్లు అవుతోంది. అందు కోసం క్రిస్టియన్ సంఘాల నేత అయిన బోరుగడ్డ అనిల్ తోనూ కలిసి పని చేశారు. తాను పదవిలోకి రాగానే మళ్లీ ప్రధాన అర్చక పదవిని ఇస్తానని జగన్ రెడ్డి దగ్గర…. హైదరాబాద్ లోటసా పాండ్లో శిలువ గుర్తు ఉన్న ఇంటి కింద ప్రామిస్ కూడా తీసుకున్నారు. కానీ ఆయనకు ఇప్పటి వరకూ హామీ నెరవేరలేదు. దీంతో సందర్భం వచ్చినప్పుడల్లా ట్వీట్లు పెడుతున్నారు.
జగన్ రెడ్డి పదవి కాలం పూర్తయ్యే సమయం దగ్గర పడటంతో తనకిచ్చిన హామీని మరోసారి రమణదీక్షితులు ట్విట్టర్ వేదికగా గుర్తు చేశారు. జస్టిస్ శివశంకర్ రావు కమిటీ నివేదికను అమలు చేయాలని కోరారు. టీటీడీని ప గ, ప్రతీకారాలతో నాశనం చేస్తున్నారని…. జగన్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవాలని ఆయన సూచించారు. రమణదీక్షితుల పింక్ డైమండ్, పోటులో తవ్వకాల ఆరోపణలు చంద్రబాబు ప్రభుత్వానికి గట్టిగానే తగిలాయి. ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం కూడా అవన్నీ ఉత్తుత్తి ఆరోపణలేనని నిజం లేదని తేల్చింది. తప్పుడు ఆరోపణలు చేసి వైసీపీకి లబ్ది చేకూర్చిన రమణదీక్షితులు మాత్రం ఇప్పటికీబాధితులుగానే ఉండిపోయారు.
ఆయనకు తన ప్రధాన అర్చక పదవి ఇస్తారనుకుంటే.. ప్రతీ సారి ఓ పని లేని పదవిని జీవో రూపంలో ఇస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. ప్రస్తుతం లఆయన శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు హోదాలో ఉన్నారు. కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు. తనపదవి తనకు వచ్చేలా చేయడానికి వంశపారం పర్య అర్చకుల సమస్యకు పరిష్కారం దొరకాలని ఆయన అంటున్నారు. వంశపారం పర్య అర్చకుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ శివశంకర్ కమిటీ నివేదికను బయట పెట్టాలని ఆయన కోరుతున్నారు. నేరుగాజగన్ అపాయింట్ మెంట్ దొరకడం ఇప్పుడు సాధ్యం కాబట్టి ఆయన ట్విట్టర్ ద్వారా వేడుకుంటున్నారు. కానీ పట్టించుకునేవారేలేరు. ప్రభుత్వం మారితే తన పరిస్థితేమిటని ఆయన ఆందోళన చెందుతున్నట్లుగా కనిపిస్తున్నారు.