తిరుమల శ్రీవారికి సంబంధించిన కొన్ని కీలకమైన ఆర్జిత సేవలు రద్దు చేయాలని టీటీడీ నిర్ణయించింది. వసంతోత్సవాలు, విశేషపూజ, కలశాభిషేకం సేవల రద్దు చేయనున్నారు. ఈ మేరకు టీటీడీకి ఆగమ పండితుల సూచించినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆగమ సలహాదారుగా … కొద్ది రోజలు కిందటే.. మాజీ ప్రధానార్చకులు రమణదీక్షితులు బాధ్యతలు చేపట్టారు. కొద్ది రోజుల్లోనే… ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. దీనికి కారణం.. బింభ పరిరక్షణ కోసమేనని చెబుతున్నారు. 600 ఏళ్ల క్రితం లభించిన మలయప్పస్వామి బింభ పరిరక్షణ కోసం.. ఈ ఆర్జిత సేవలు రద్దు చేయాలని టీటీడీ ఆగమసలహామండలి సూచించినట్లుగా… ఉన్నతాధికారులు చెబుతున్నారు.
ప్రతి నిత్యం స్నపన తిరుమంజనం నిర్వహిస్తే.. బింభం అరుగుదల సంభవిస్తుందని ఆగమపండితులు నివేదిక ఇచ్చారట. ఇకపై ఏడాదికి ఒక రోజు వసంతోత్సవాలు, సహస్ర కలశాభిషేకం.. విశేష పూజలు నిర్వహిస్తే చాలని.. వారు చెప్పారంటున్నారు. తిరుమలలో ఏదైనా ఆగమ పండితుల సలహా మేరకే జరుగుతుంది. అయితే.. అనూహ్యమైన నిర్ణయాలు తీసుకోవడం …భక్తుల మనోభావాలకు విరుద్ధంగా.. వ్యవహరించే పనిని ఆగమ సలహామండలి కూడా చేయదు.
దశాబ్దాలుగా.. శ్రీవారికి అత్యంత ఇష్టమైనవిగా చెప్పుకునే వసంతోత్సవాలు, విశేషపూజ, కలశాభిషేకంలను.. కేవలం బింభం అరుగుదలను కారణంగా చూపి.. నిలిపివేయాలని నిర్ణయించడమే ఆసక్తికరం. జగన్ కోసం ..।శ్రీవారికి పాద పూజ చేస్తానంటూ.. బహిరంగంగా ప్రకటించుకున్న… రమణదీక్షితులు ఇప్పుడు ఆగమసలహాదారుగా ఉండటం.. ఈ నిర్ణయానికి మరింత వివాద కోణం జత చేసే అవకాశం ఉంది.