శ్రీవారి మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు …. మళ్లీ తన పదవి కోసం.. సీఎం జగన్ పై అన్ని రకాల వ్యూహాలు పన్నుతున్నారు. కానీ వర్కవుట్ కావడం లేదు. గతంలో అసంతృప్తి స్వరాన్ని..తిరుగుబాటు హెచ్చరికల్ని చేసి.. చేసి అలసిపోయిన ఆయన ఇప్పుడు.. సీఎంగారూ.. మీరే న్యాయం చెప్పాలంటూ.. ట్విట్టర్ ద్వారా వేడుకుంటున్నారు. శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులుగా తనను నియమించమని మీరు టీటీడీ అధికారులను ఆదేశించినా… బేఖాతరు చేస్తున్నారని ట్విట్టర్లో ఫిర్యాదు చేశారు. తనను గౌరవ ప్రధాన అర్చకులుగా నియమించారని కానీ తాను ఆ పదవిని తిరస్కరించానని చెప్పారు.
ఈ విషయంలో వెంటనే స్పందించి మీ ఆదేశాలను టీటీడీ అధికారులు వెంటనే అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే.. రమణదీక్షితులు… ఓ మైండ్ గేమ్ ఆడుతున్నారని ఎవరికైనా సులువుగానే అర్థమైపోతుంది. రమణదీక్షితులకు గౌరవ ప్రధాన అర్చకులు పదవి మాత్రమే ఇవ్వాలన్నది ప్రభుత్వ నిర్ణయం కాబట్టి ఆ పదవి ఇచ్చారు. టీటీడీ చైర్మన్గా ఉన్నది… స్వయంగా జగన్మోహన్ రెడ్డి సమీప బంధువే. వైసీపీ వ్యవహారాలు చక్కబెట్టే వ్యూహకర్తల్లో ఒకరు. ఆయనే అలా నియమించారంటే..జగన్ మోహన్ రెడ్డి ఆ పదవి వరకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అర్థం. అయితే.. ఈ విషయం అర్థం చేసుకోలేనంత అమాయకుడేమీ కాదు రమణద దీక్షితులు.
అందుకే నిన్న మొన్నటిదాకా ఆయన… కాస్త హెచ్చరిక స్వరంతో.. తిరుగుబాటు చేస్తామన్నట్లుగా… ట్వీట్లు పెట్టారు. సుబ్రహ్మణ్యస్వామితో కలిసి.. టీటీడీని ప్రభుత్వం నుంచి తప్పించేలా న్యాయపోరాటం చేస్తున్నట్లుగా ట్వీట్ల ద్వారా సందేశం పంపారు. అవేమీ వర్కవుట్ కాలేదు. దాంతో ఇప్పుడు బతిమాలుకోవడానికి వచ్చారని అంటున్నారు. అయితే.. నేరుగా కలిసే అవకాశం రమణదీక్షితులకు లేకుండా పోయింది. ఎందుకంటే ఇప్పుడు.. సీఎం జగన్ అపాయింట్మెంట్ మంత్రులకే దొరకదు.. ఇక రమణదీక్షితులకేమి దక్కుతుంది..?
https://twitter.com/DrDikshitulu/status/1297056176341835776