నందమూరి బాలకృష్ణ ఎప్పటి నుండో చేయాలని అనుకుంటున్నా బయోపిక్ ‘రామానుజాచార్య’. తాజాగా ఈ బయోపిక్ గురించి నిర్మాత సి కళ్యాణ్ మాట్లాడారు. ” బాలకృష్ణ గారితో ‘రామానుజాచార్య’ ప్రాజెక్ట్ ని అంతర్జాతీయ స్థాయిలో నిర్మించడానికి చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. ఓ అంతర్జాతీయ సంస్థ, రవి కొట్టారకర తో కలసి చినజీయర్ స్వామి వారి సహకారంతో ఈ ప్రాజెక్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాను” అని చెప్పుకొచ్చారు.
అలాగే తమిళనాడు ప్రభుత్వం సహకారంతో 200 కోట్ల రూపాయిలతో కళ్యాణ్ అమ్యుస్మెంట్ పార్క్ ని నిర్మిస్తున్నారాయన. కళ్యాణ్ అమ్యుస్మెంట్ పార్క్ ఇనాగరేషన్ రోజున బాలకృష్ణ ప్రాజెక్ట్ ఓపెనింగ్ చేయాలనీ భావిస్తున్నట్లు తెలిపారు. కళ్యాణ్ అమ్యుస్మెంట్ పార్క్ ప్రాజెక్ట్ చేయడం తమిళనాడు ప్రభుత్వం, దేవుడు ఇచ్చిన వరమని చెప్పుకొచ్చారు కళ్యాణ్. ‘చెన్నై నుండే ఒక సహాయ దర్శకుడిగా నా కెరీర్ ప్రారంభమైయింది. ఇప్పుడు అక్కడ ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేయడం ఒక మైల్ స్టోన్ మార్క్ గా నిలుస్తోందని’ ఆనందం వ్యక్తం చేశారు.