రవితేజ కథానాయకుడిగా నటించిన సినిమా `రామారావు ఆన్ డ్యూటీ`. ప్రశాంత్ మాండవ దర్శకుడు. ఈ సినిమాని జూన్ 17న విడుదల చేద్దామనుకున్నారు. చిత్రబృందం విడుదల తేదీ కూడా ప్రకటించింది. అయితే ఇప్పుడు ఈ సినిమా విడుదల వాయిదా పడింది. ఈ విషయాన్ని చిత్రబృందం రూఢీ చేసింది. జూన్ 17న ఈ సినిమా రావడం లేదని, కొత్త రిలీజ్ డేట్ త్వరలో ప్రకటిస్తామని క్లారిటీ ఇచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో జాప్యం వల్లే సినిమా ఆలస్యమైందని ప్రకటించింది. శ్యామ్ సి.ఎస్ ప్రస్తుతం రీ రికార్డింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఆ తరవాత ప్రమోషన్లు మొదలెట్టాలి. అందుకే…. చిత్రబృందం ఇంకొంచె సమయం తీసుకోవాలని డిసైడ్ అయ్యింది. దివ్యాంశ కౌశిక్, రజీషా విజయన్ కథానాయికలుగా నటించారు. చాలా కాలం తరవాత వేణు తొట్టెంపూడి ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.