‘‘ఆయుధం మీద ఆధారపడే నీలాంటివాడి ధైర్యం వాడే ఆయుధంలో ఉంటుంది. ఆయుధంలా బతికే నాలాంటివాడి ధైర్యం అణువణునా ఉంటుంది’’అంటున్నాడు రవితేజ. మహా శివరాత్రి సందర్భంగా రవితేజ కొత్త సినిమా ‘రామారావు ఆన్ డ్యూటీ’ టీజర్ బయటికి వచ్చింది. పేరు సింపుల్ గా వున్నా వాడో సూపర్ మ్యాన్ అనే డైలాగ్ తో మొదలైన ఈ టీజర్ లో యాక్షన్ బాగానే దట్టించారు. ఎలివేషన్ ,ఫైట్లతో టీజర్ ని సాలిడ్ కట్ చేశారు. ఈ సినిమాలో రవితేజ డిప్యుటీ కలెక్టర్ గా కనిపించనున్నాడు. ప్రభుత్వ అధికారిక ఒక చేతితో టైపు చేసి మరో చేత్తో సంతకాలు పెట్టడం, ప్రజల సమస్యలని వినడం లాంటి షాట్స్ టీజర్ లో చూపించారు. చాలా రోజుల తర్వాత హీరో వేణు ఇందులో ఓ పాత్ర చేశాడు. ఆయన కూడా టీజర్ లో కనిపించాడు. శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం శామ్ సీఎస్ అందిస్తున్నారు.