రామ్‌చరణ్ -సుకుమార్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీస్సంస్థ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. జూన్ 1 నుంచి రాజమండ్రిలో రెగ్యులర్షూటింగ్నిర్వహిస్తామని చిత్రబృందం తెలిపింది. ఈపాటికే రాజమండ్రిలో చిత్రీకరణ జరగాల్సివుంది. అయితే సమ్మర్ ఎఫెక్ట్‌తో షూటింగ్ వాయిదా పడింది. సమంతకి వడ దెబ్బ తగిలిందని, అందుకే షూటింగ్ ఆపేశామని, ఎండలుఎక్కువగా ఉన్న కారణంగా జూన్ 1 కి షూటింగ్ వాయిదా వేశామని చిత్రబృందం తెలిపింది. అయితే నిజానికి వడ దెబ్బ ఎఫెక్ట్ చరణ్‌పైనే పడిందట. రెండ్రోజులు ఎడతెరిపి లేకుండా ఎండల్లో షూటింగ్ చేసేసరికి చరణ్బాగా నీరసించిపోయాడట. చరణ్ పరిస్థితి చూసి.., చిత్రబృందం కంగారు పడిందని తెలుస్తోంది.
ముందు జాగ్రత్త చర్యగా చరణే షూటింగ్‌కి డుమ్మా కొట్టాడని, చరణ్ గైర్హాజరుతో షూటింగ్ వాయిదా వేయక తప్పలేదని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈరోజు చిత్రబృందం విడుదల చేసిన ప్రెస్ నోట్లో మాత్రం ఎండ దెబ్బ సమంతకు తగిలిందని, అందుకే షూటింగ్ వాయిదా వేశామని చిత్రబృందం ప్రకటించింది. రాజమండ్రిలో ఎండలు దంచేస్తున్నాయన్నది నిజం. పైగా.. చిత్రబృందం చెట్లూ, చేమలూ లేని ప్రాంతంలో షూటింగ్ పెట్టుకొంది. దాంతో ఆ ఎఫెక్ట్ మరింత దారుణంగా పడుతోంది. అందుకే షూటింగ్ క్యాన్సిల్ చేయాల్సివచ్చిందని తెలుస్తోంది. ఆగస్టు నాటికి సినిమా పూర్తి చేయాలని సుకుమార్ భావిస్తున్నాడు. సమ్మర్ ఎఫెక్ట్తోరెండు వారాలు గ్యాప్ వచ్చినా, దాన్ని ఏదో ఓ రూపంలో భర్తీ చేయాలని చూస్తున్నాడు సుకుమార్.