హైదరాబాద్: రాంచరణ్ – శ్రీనువైట్ల కాంబినేషన్లో దానయ్య నిర్మిస్తున్న చిత్రం తుదిదశలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి మెరుపు అనే టైటిల్ ఖరారు చేసినట్లు ఫిల్మ్‌నగర్ వర్గాల సమాచారం. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం దసరాకు విడుదలచేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. టైటిల్‌ను చిరంజీవి పుట్టినరోజైన ఆగస్ట్ 22న ప్రకటిస్తారని తెలిసింది. ఇంతకుముందు ఈ చిత్రానికి బ్రూస్లీ, మై నేమ్ ఈజ్ రాజు, ఫైటర్, విజేత అనే టైటిల్స్ పెడదామని అనుకున్నప్పటికీ చివరికి మెరుపును ఖరారు చేశారు. వాస్తవానికి ఈ టైటిల్‌తో గతంలో రాంచరణ్-ధరణి కాంబినేషన్లో ఒక ప్రాజెక్ట్ ముహూర్తంకూడా జరుపుకున్నప్పటికీ, ఎందుకనో పట్టాలపైకెక్కలేదు. దానినే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌కు పెట్టారు. బ్యాంకాక్‌లో భారీస్థాయిలో క్లైమాక్స్ సన్నివేశాలు షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పుడు హైదరాబాద్‌లో జరుగుతోంది.
వరస పరాజయాల తర్వాత చేస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను ఎలాగైనా హిట్ చేయాలని శ్రీనువైట్ల కృతనిశ్చయంతో ఉన్నారు. మరోవైపు గతంలో ఆయనతో గొడవపడ్డ ప్రకాష్ రాజ్, కోన వెంకట్ ఈ చిత్రంలో మళ్ళీ కలిసి పనిచేయటం విశేషం.