ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసారంటూ.. కృష్ణా జిల్లా పెడన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకున్నారు. ఈ నెల 17న ఎన్నికలు పూర్తయ్యే వరకు మీడియాతో మాట్లాడవద్దని ఆదేశించింది. సభలు, సమావేశాలు, ప్రచారాల్లో మాట్లాడకూడదని … ఉత్తర్వులు అమలు చేయాలని కలెక్టర్, ఎస్పీలకు ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసింది. జోగిరమేష్ ఏమన్నారంటే… వైసీపీ కాకుండా వేరే పార్టీ వాళ్లు నామినేషన్లు వేస్తే.. ప్రభుత్వ పథకాలు కట్ చేస్తామని బహిరంగంగా హెచ్చరించారు. ఆయన వ్యాఖ్యల వీడియో వైరల్ కావడంతో… జోగి రమేష్‌పై టీడీపీ, జనసేన ఫిర్యాదులు చేశాయి. ఈ ఫిర్యాదులతో పాటు.. ఆధారాలు కూడా సమర్పించారు. వీటిని పరిశీలించిన ఎస్ఈసీ ఆయన నోటికి తాళం వేయాలని నిర్ణయించింది.
నిజానికి జోగి రమేష్ ఒక్కడే కాదు… ప్రతి ఒక్క వైసీపీ నేత అదే పనిచేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో దువ్వాడ శ్రీనివాస్ అనే రాజకీయ నేత చేసిన హడావుడి అంతా ఇంతాకాదు. దాదాపుగా ప్రతి నియోజకవర్గంలోనూ వైసీపీ నేతలు.. ఓటర్లను బెదిరించారు. తెనాలి లాంటి చోట్ల… వైసీపీ నేతలు.. వాలంటీర్ల ద్వారా ఓటు స్లిప్‌లు పంపిణీ చేయించారు. ఆ స్లిప్‌లపై తాము ఇస్తున్న పథకాల లబ్దిదారుల గురించి రాసి ఇస్తున్నారు. కన్నబాబు రాజు అనే ఎమ్మెల్యే… తో సహా అందరూ బెదిరింపులకు దిగుతున్నారు. మాచర్ల లాంటి చోట్ల 95 శాతం గ్రామాలు ఏకగ్రీవం అయ్యాయంటే.. ఏ స్థాయిలో ప్రజాస్వామ్య ప్రక్రియ అపహాస్యం అయి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
కారణమేమిటో కానీ.. ఎస్ఈసీ ఇటీవలి కాలంలో పూర్తి స్థాయిలో దూకుడు తగ్గించేశారు. ఆయన సైలెంటయిపోయారు. గవర్నర్ ఏమైనా సందేశం ఇచ్చారో లేదో కానీ… ఆయన మాత్రం… వీలైనంత కామ్‌గా ఉంటున్నారు. అందుకే.. రెండో విడత నుంచి వైసీపీ నేతల హడావుడి మరీ ఎక్కువ అయిపోయింది. ఎస్ఈసీ కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితికి చేరిపోతున్నారు.