రామ్ గోపాల్ వర్మ బ్రూస్లీని కూడా వదిలిపెట్టలేదు. బ్రూస్ లీ అని కూడా చూడకుండా ట్విట్టర్ లో ఓ రెండు పంచ్ లు వేసేసారు. “రామ్ చరణ్ తేజ్ నటించిన బ్రూస్ లీ సినిమా చూసిన తరువాత ఇప్పుడు ఎంటర్ ద డ్రాగన్ సినిమాలో బ్రూస్ లీ ని చూస్తున్నాను. బ్రూస్ లీ సినిమాలో రామ్ చరణ్ తేజ్ కి బ్రూస్ లీ అనే పేరు ఉండి ఉంటే నిజంగానే బ్రూస్ లీ లాగ ఉండేవాడు. అసలు బ్రూస్ లీ లేని ఆ సినిమాకి బ్రూస్ లీ అని ఎందుకు పేరు పెట్టారో అర్ధం కావడం లేదు. ఆనాటి బ్రూస్ లీ ఈనాటి ఈ బ్రూస్ లీ గురించి ఏమనుకొని ఉండేవారో?” అని బ్రూస్ లీ కి చురకలు వేశారు.
ఆ చేత్తోనే మెగాస్టార్ చిరంజీవి గురించి కూడా రెండు ముక్కలు ట్వీటేశారు.
“అసలు బాస్ (చిరంజీవి) తన 150వ సినిమాగా ఈ బ్రూస్ లీలో ఎందుకు నటించారో అర్ధం కావడం లేదు. తన 151వ సినిమా ఈ బ్రూస్ లీ కంటే బాగుటుందని ఆశిస్తున్నాను. మెగాస్టార్ కి మెగాఫ్యాన్ గా బ్రూస్ లీ పవర్ ఫ్యాన్ గా చిరంజీవి 151వ చిత్రం మెగా కిక్కింగ్ పవర్ పంచ్ ఇస్తుందని ఆశిస్తున్నాను. అయినా తెలియక అడుగుతున్నాను బాస్ 151వ సినిమా ఇంకా ఎప్పుడు మొదలవుతుంది?” అని ట్వీటేశారు.
ఇంతకీ రామ్ గోపాల్ వర్మ చెపుతున్నది ఏమిటంటే రామ్ చరణ్ తేజ్ నటించిన ఈ బ్రూస్ లీ సినిమా తనకు అంతగా నచ్చలేదని…చిరంజీవి అటువంటి సినిమాలో నటించి తప్పు చేసాడని..కనీసం తన 151వ సినిమా అయినా దీనికంటే బాగా తీయమని సలహా ఇస్తున్నారు. మరి మెగా ఫ్యాన్స్ ఏమంటారో?