రాంకీ .. ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ అవుతోంది. వైఎస్ సీఎం కాక ముందు ఈ కంపెనీ ఎక్కడ ఉండేదో ఎవరికీ తెలియదు. కానీ సీఎం అయ్యాక.. ఈ సంస్థ రాత మారిపోయింది. దానికి తగ్గట్లుగా చాలా అక్రమాస్తుల కేసుల్లో ఇరుక్కున్నారు. కేసులు పడితే పడ్డాయి కానీ.. అప్పనంగా వచ్చిన సొమ్ము మాత్రం పోగుపడిపోయింది. అది అలాగే ఉంది. ఆ గుట్టంతా జగన్ కు తెలుసు కాబట్టి రాంకీ అధినేత ఆళ్ల అయోధ్యరామిరెడ్డి వైసీపీకి కావాల్సిన ఆర్థిక సహకారం అందిస్తూ.. పనులు చక్క బెడుతూ జగన్ చుట్టూనే తిరుగుతూంటారు.
వైసీపీ ఏపీలో అధికారంలో ఉన్న ఆదేళ్లలో … రాంకీది కీలక పాత్ర. జగన్ రాష్ట్రాన్ని నలుగురు ఐదుగురు రెడ్లకు అప్పగిస్తే అందులో ఒకరు ఈ రాంకీ అయోధ్యరామిరెడ్డి, నర్సరావుపేటలో 2014లో ఓడిపోయారని రాజ్యసభ సీటు ఇచ్చారు, ఆ తర్వాత పార్టీ వ్యవహారాల్ని చక్కబెట్టారు. అయితే చాలా వరకూ లైమ్ లైట్లోకి రాకుండా సైలెంట్ గా పని చేసుకుపోతారు. ఈయనకు ఉన్న రాంకీ ఇన్ ఫ్రా హైదరాబాద్ లో వైఎస్ ఉన్నప్పుడు రాయించేసుకున్న భూములతో రియల్ ఎస్టేట్ చేస్తోంది.
ఇప్పుడా కంపెనీ వైసీపీ కార్యాలయాలను నిర్మిస్తోంది. ఇరవై ఆరు ప్యాలెస్లు కనీసం వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి నిర్మిస్తోంది. అంత సొమ్ము వైసీపీ.. రాంకీకి చెల్లిస్తుందా అంటే లేదు. వైసీపీ నుంచి ఒక్క రూపాయి కూడా ఆ కంపెనీకి చేరలేదు. మరి ఎందుకు కడుతోంది.. అసలా ఒప్పందం ఏమిటి అంటే.. ఎవరికీ తెలియదు. కంపెనీ కూడా చెప్పడం లేదు. ప్రభుత్వం వద్ద లీజుకు తీసుకున్న భూముల్లో పర్మిషన్ల కోసం రాంకీ ఇన్ ఫ్రా అప్లయ్ చేసింది. అసలు ఈ లోగుట్టేమిటో బయటపడాల్సి ఉంది. ఎవరు బయటకు తీస్తారో ?