ఈనాడు,ఈటీవీ, రామోజీ గ్రూప్ ఆర్థిక పరిస్థితిపై సోషల్ మీడియాలో అనేక ప్రచారాలు జరుగుతున్నా…ఆ సంస్థలో మాత్రం అంతా కూల్ గా గడిచిపోతోంది. దానికి తాజా సాక్ష్యం.. రామోజీ గ్రూప్‌లోని ఈటీవీ విభాగం.. సిల్వర్ జూబ్లీ జరుపుకోనుండటం. దానిదేముంది.. పాతికేళ్లు గడిస్తే ఆటోమేటిక్‌గా జరిపేసుకుంటారు కదా అనుకోవచ్చు..కానీ ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అందరికీ యాజమాన్యం బోనస్ ప్రకటించడమే ఇందులో ఉన్న అసలు విశేషం.
సుదీర్ఘ కాలంగా పని చేస్తున్న వారికి రెండు నెలలు…మిగిలిన వారికి నెలన్నర, నెల బోనస్‌గా ఇస్తున్నట్లుగా అధికారికంగా ఉద్యోగులందరికీ సమాచారం పంపింది. కరోనా విలయం తర్వాత అన్ని మీడియా సంస్థలు ఇబ్బందుల్లో పడ్డాయి. అందరూ జీతాలు కోత కోశారు. ఈనాడు దినపత్రికలోనూ ఇలాంటి కోతలు జరిగాయి. కానీ.. ఆ కారణంతో అన్నింటి మీద ప్రభావం చూపించాలనుకోలేదు.
టీవీ మీడియాలో మాత్రం ఎలాంటి జీతాల కోతలు.. అలవెన్స్ కోతలను రామోజీ గ్రూప్ అమలు చేయలేదు. ఇప్పుడు బోనస్ కూడా ప్రకటించారు. ఆర్థిక పరిస్థితి బాగున్నప్పటికీ.. కొన్ని సంస్థలు జీతాలను కోతపెట్టాయి. కానీ రామోజీ గ్రూప్ … ప్రత్యేకంగా బోనస్‌లు ఇవ్వడం…అభినందించాల్సిన విషయమే.