ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో ప్రధాన పాత్ర పోషించారు రామోజీ రావు. ఆయన స్థాపించిన ఈనాడు సంస్థ.. ఎన్టీఆర్ రాజకీయంగా ఎదగడానికి ప్రత్యక్ష్యంగా పరోక్షంగా సహాయం చేసింది. అంతేకాదు.. రాజగురుగా రామోజీ ఇచ్చిన సలహలు, సూచనలు ఎన్టీఆర్ ఎదుగుదలకు బాగా ఉపయోగపడ్డాయి. ఎన్టీఆర్ జీవిత కథని సినిమాగా తీస్తున్నప్పుడు… రామోజీ రావు సూచనలు, ఆశీస్సులు అందకుండా ఎలా ఉంటాయి? ప్రస్తుతం ఎన్టీఆర్ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ సందర్భంగా సెట్ సందర్శించారు రామోజీ రావు. అక్కడ ఓ అరగంట గడిపి… అందరితో మాట్లాడి వెళ్లారు. రామోజీ రాక తమ టీమ్‌కి ఎంతో మనో బలాన్నీ, ఉత్సాహాన్ని ఇచ్చిందని క్రిష్ ట్వీట్ చేశాడు. ఓ ఫొటో కూడా పంచుకున్నాడు. ఈ సినిమాలో రామోజీని పోలిఉన్న ఓ పాత్ర ఉందని ముందు నుంచీ ప్రచారం జరుగుతోంది. ఈ సందర్భంగా ఆ పాత్ర గురించి కూడా క్రిష్ రామోజీకి వివరించినట్టు సమాచారం. ఈ సినిమాకి సంబంధించి రామోజీ కొన్ని విలువైన సూచనలు కూడా ఇచ్చినట్టు సమచారం. ఈ సినిమా ప్రారంభానికి ముందే బాలయ్య రామోజీని కూడా కలుసుకున్నార్ట. రామోజీ ఇచ్చిన సలహాల్నీ, సూచనల్నీ క్రిష్, బాలయ్యలు ఎంత వరకూ అమలు చేస్తారో చూడాలి.