హైదరాబాద్ లో నార్త్ ఈస్ట్ జోన్ లో ఐటీ రంగం క్రమంగా అభివృద్ధి చెందుతోంది. దాంతో సహజంగానే రియల్ ఎస్టేట్ ఊపందుకుంటోంది. పోచారంలో ఇన్ఫోసిస్ క్యాంపస్ తర్వాత పూర్తిగా మారిపోయింది. అయితే ఇప్పటికీ మధ్యతరగతికి అందుబాటులోనివాసాలు ఉన్నాయి. రాంపల్లి ప్రాంతం ఈ విషయంలో మధ్యతగతిని ఆకట్టుకుంటోంది. పోచారం ఐటీ పార్క్‌కు సమీపంలో రాంపల్లి ఉంది. ఫిర్జాదిగూడ, ఘట్ కేసర్, పోచారం చు్టటీ ఉంటాయి. ఈ ప్రాంతానికి ఓఆర్ఆర్ ద్వారా కనెక్టివిటీ కూడా ఉంది. విద్యా, వైద్య సౌకర్యాలకు లోటు లేదు. ప్రసిద్ది చెందిన సంస్థలు ఉన్నాయి.
ప్రస్తుతం అపార్టుమెంట్లలో ధరలు నాలుగు వేల నుంచి లభిస్తున్నాయి. పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడ నిర్మాణాలు చేస్తున్నాయి. అలాంటి చోట్ల స్క్వేర్ ఫీడ్ ఐదు వేల వరకూ చెబుతున్నారు. ఈ ఏరియాలో ఇరవై శాతం అపార్టుమెంట్లు నలభై లక్షల నుంచి అరవై లక్షలకే లభిస్తున్నాయి. కాస్త ఓపిక చేసుకుని తిరిగితే మంచి ఇల్లు దొరుకుతుంది. విల్లా ప్రాజెక్టులకు కేంద్రంగా రాంపల్లి మారింది. పలు విల్లాలతో పాటు విల్లా స్థలాలను కూడా అమ్మకానికి పెట్టారు.
రాబోయే రోజుల్లో పోచారం వైపు ఐటీ రంగం మరింత విస్తరించనుంది. అదే సమయంలో అటు వైపు ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. అందుకే రాంపల్లి లగ్జరీ నివాసాలకు కేంద్రంగా రాబోయే రోజుల్లో మారుతుందని అంచనా వేస్తున్నారు. ఈశాన్య హైదరాబాద్ లో ఇల్లు కావాలనుకునేవారు…బడ్జెట్ లో చూసుకోవాలనుకుంటే.. ఓ సారి రాంపల్లిలో లుక్ వేసి రావొచ్చు.