ఇస్మార్ట్ శంకర్ తో ఓ సూపర్ హిట్ అందుకున్నాడు రామ్. ఇప్పుడు కిషోర్ తిరుమలతో ఓ సినిమా చేస్తున్నాడు. స్రవంతి రవికిషోర్ ఈ చిత్రానికి నిర్మాత. దీనికి ‘రెడ్’ అనే పేరు ఖరారు చేశారు. ఓ తమిళ సూపర్ హిట్ చిత్రానికి ఇది రీమేక్. అదో యాక్షన్ నేపథ్యంలో సాగే థ్రిల్లర్ సినిమా. కథకు తగినట్టుగానే `రెడ్` అనే పేరు ఖాయం చేశారు. కొద్దిసేపటి క్రితమే ఫస్ట్ లుక్‌ని కూడా విడుదల చేశారు. రామ్ లుక్ మాసీగా, `రా`గా ఉంది. జుత్తుని బాగా కత్తిరించేశాడు. సినిమా అంతా ఇదే లుక్‌లో కనిపించనున్నాడు రామ్. నవంబరు 16 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించనున్నారు. కిషోర్ తిరుమలతో రామ్ చేస్తున్న మూడో సినిమా ఇది. నేను – శైలజ మంచి హిట్టయ్యింది. ఉన్నది ఒక్కటే జిందగీ యావరేజ్ టాక్‌తో సరిపెట్టుకుంది. అయితే అవి రెండూ క్లాస్ కథలే. ఈసారి మాత్రం రామ్‌ని పూర్తిగా మాస్ పాత్రలోకి మార్చేస్తున్నాడు కిషోర్ తిరుమల. మరి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.