చిన్నా లేదు.. పెద్దా లేదు. హీరోలందరి దృష్టీ.. ఇప్పుడు పాన్ ఇండియాపై పడింది. కథని కాస్త అటూ ఇటు చేసి, స్టార్ బలం పెంచి, బడ్జెట్ పెంచి – అలా.. అలా పాన్ ఇండియా లుక్ తీసుకొచ్చేస్తున్నారు. రామ్ కి కూడా.. పాన్ ఇండియా ఐడియాలు ఉన్నాయి. `ఇస్మార్ట్ శంకర్` సినిమా… హిందీ (డబ్బింగ్) లో బాగా చూశారు. `నేను శైలజ`, `గణేష్` లాంటి సినిమాలకు సైతం మంచి ఆదరణ దక్కింది. అందుకే… `తదుపరి పాన్ ఇండియానే` అని ఫిక్సయిపోయాడు.
ప్రస్తుతం… లింగుస్వామితో ఓ సినిమా చేయబోతున్నాడు రామ్. లింగు స్వామి సినిమాలన్నీ యాక్షన్ కథలే. థ్రిల్లింగ్ మూమెంట్స్ బాగా ఉంటాయి. ఇలాంటి కథలు.. పాన్ ఇండియా మార్కెట్ కి సరిగా సరిపోతాయి. పైగా లింగు స్వామి సినిమా అంటే.. సౌత్ లో మంచి క్రేజ్ ఉంది. తమిళ, కన్నడ, మలయాళ మార్కెట్ బాగుంటుంది. కాస్త బడ్జెట్ పెంచుకుని, బాలీవుడ్ నటీనటులకు చోటిస్తే – హిందీ మార్కెట్ కి కూడా దగ్గరవ్వొచ్చు. పాన్ ఇండియా కలలు కంటున్న రామ్ కి ఇదే మంచి ఛాన్స్. లింగు స్వామి కథకు ఓకే చెప్పింది కూడా ఈ కారణంతోనే.. అనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి టాలీవుడ్ నుంచి మరో హీరో.. పాన్ ఇండియా రెక్కలు తొడుక్కోబోతున్నాడన్నమాట.