నాగచైతన్య హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘శైలజారెడ్డి అల్లుడు’. టైటిల్లోనే అత్త క్యారెక్టర్‌కి సినిమాలో ఎంత ఇంపార్టెన్స్ వుందనేది తెలుస్తోంది. అంత ముఖ్యమైన అత్త పాత్రలో ఒకప్పుడు నాగార్జునతో పలు హిట్ సినిమాల్లో నటించిన రమ్యకృష్ణను తీసుకున్నారు. అయితే ఆవిడగారు లేకుండానే ఇన్ని రోజులూ షూటింగ్ చేశారు. ఫైనల్లీ.. ఈ రోజు రమ్యకృష్ణ సినిమా సెట్స్‌లోకి అడుగు పెట్టారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ‘శైలజారెడ్డి అల్లుడు’ కోసం స్పెషల్ సెట్ వేశారు. సినిమాలో రమ్యకృష్ణ హౌస్ సెట్ అది. శైలజారెడ్డిగారింట్లో రమ్యకృష్ణ అడుగు పెట్టారన్నమాట. ప్రజెంట్ నాగచైతన్య, హీరోయిన్ అనూ ఇమ్మాన్యుయేల్, కమెడియన్ వెన్నెల కిషోర్ తదితరులపై సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. సుమారు ఇరవై రోజుల పాటు రమ్యకృష్ణ షూటింగ్ చేస్తారని తెలుస్తోంది. నిజానికి, ఈ నెల 15న రమ్యకృష్ణ షూటింగులో జాయిన్ అవుతారని అనుకున్నారు. ఓ ఐదు రోజులు షెడ్యూల్ లేట్ అయ్యింది. మారుతి పక్కా ప్లానింగ్‌తో షెడ్యూల్స్ ప్లాన్ చేస్తార్ట. జూలై నెలాఖరులోపు షూటింగ్ కంప్లీట్ చేసి, ఆగస్టు నెలాఖరున సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నార్ట.