నేనే రాజు – నేనే మంత్రి తో తేజ ఫామ్ లోకి వచ్చాడు. అయితే `సీత`తో ఓ డిజాస్టర్ తగిలింది. కాకపోతే… తనకొచ్చిన అవకాశాలకు కొదవ లేదు. ఒకేసారి రెండు ప్రాజెక్టుల్ని ఒప్పుకున్నాడు. ఒకటి గోపీచంద్‌తో. మరోటి రానాతో. రెండింటికీ వైవిధ్యభరితమైన పేర్లు పెట్టి – ఆకట్టుకున్నాడు.
అయితే ఇప్పుడు తేజ ముందు మరో మంచి ఆఫర్ వచ్చింది. అమేజాన్ తో లింక్ అప్ అయి వెబ్ సిరీస్‌లను తీసే అవకాశం వచ్చింది. అమేజాన్ అంటే పెద్ద ప్రాజెక్టే. ఎందుకంటే.. సినిమాలకు మించిన బడ్జెట్ ఇవ్వడానికి వాళ్లు రెడీ. లాక్ డౌన్ ఎత్తేసిన వెంటనే ఈ వెబ్ సిరీస్‌లను మొదలెట్టే అవకాశం ఉంది. దాంతో.. తాను ముందు ఒప్పుకున్న రెండు ప్రాజెక్టులూ తాత్కాలికంగా పక్కన పెట్టే అవకాశం ఉంది. అయితే అదేం పెద్ద సమస్య కాదు. గోపీచంద్ ప్రస్తుతం `సిటీమార్`తో బిజీగా ఉన్నాడు. రానా `విరాటపర్వం`తో బిజీ. లాక్డౌన్ ఎత్తేశాక, షూటింగులు మొదలైతే – ముందు ఆ సినిమాల్ని పూర్తి చేసుకోవాలి. ఆ తరవాతే తేజకు కాల్షీట్లు ఇస్తారు. ఈలోగా ఆమేజాన్కి సంబంధించి ఓ వెబ్ సిరీస్‌ను తేజ పూర్తి చేసే అవకాశం ఉంది. తేజ వర్క్‌లో చాలా ఫాస్టు. తక్కువ సమయంలోనే పూర్తి చేసేస్తుంటాడు. వెబ్ సిరీస్‌కి కావల్సింది అదే. తక్కువ లొకేషన్లు, పరిమితమైన కాస్టింగ్ తో ఈ వెబ్ సిరీస్‌ని తేజ పూర్తి చేసే అవకాశం ఉంది. ఆ తరవాత గోపీచంద్, రానాలలో ఎవరు ముందు ఫ్రీ అయితే.. వాళ్లతో ప్రాజెక్టుని పట్టాలెక్కిస్తాడు.