కార్తి ‘సర్దార్’తో గుర్తింపు తెచ్చుకొన్నాడు దర్శకుడు మిత్రన్. ఇప్పుడు ‘సర్దార్ 2’ పనుల్లో ఉన్నాడు. అయితే తెలుగులో మిత్రన్ ఓ సినిమా చేయాల్సివుంది. ఇద్దరు ముగ్గురు నిర్మాతల దగ్గర అడ్వాన్సులు తీసుకొన్నాడు. చిరంజీవితో భేటీ కూడా వేశాడు. మిత్రన్ తో చిరు సినిమా దాదాపు ఓకే అయ్యిందని వార్తలొచ్చాయి. ఆ తరవాత నానికి కూడా ఓ కథ వినిపించినట్టు టాక్. ఎట్టకేలకు ఇప్పుడు రానాతో ఫిక్స్ అయ్యాడని తెలుస్తోంది. రానాకు ఇటీవల మిత్రన్ ఓ కథ చెప్పారని, అది రానాకు నచ్చిందని, త్వరలోనే ఈ ప్రాజెక్టుని పట్టాలెక్కిస్తారని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. నిర్మాణ సంస్థ ఎవరైనా సరే, రానా నిర్మాణంలో భాగం పంచుకొంటాడని సమాచారం. అయితే చిరంజీవి, నానిలకు చెప్పిన కథ అయితే కాదు. రానా కోసం పూర్తిగా కొత్త కథ రాసుకొన్నాడట మిత్రన్. రానా కథల ఎంపిక చాలా వినూత్నంగా ఉంటుంది. రెగ్యులర్ కథల్ని రానా ఒప్పుకోవడం లేదు. మిత్రన్ కూడా ఓ సర్ప్రైజింగ్ ప్యాకేజీతోనే రానా దగ్గరకు వెళ్లాడని, ఈ సినిమా కొత్త పంథాలో సాగుతుందని తెలుస్తోంది. త్వరలోనే పూర్తి వివరాలు బయటకు వస్తాయి.