రానా – తేజ కలయికలో ‘నేనే రాజు – నేనే మంత్రి’ వచ్చింది. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకొంది. ఆ తరవాత వీరిద్దరి కాంబోలో ‘రాక్షసరాజా’ అనే సినిమా ప్రకటించారు. కానీ ఇప్పటి వరకూ ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్ డేట్ లేదు. అయితే ఇన్ సైడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా ఆగిపోయిందని టాక్. బడ్జెట్ కారణాలతోనే ఈ ప్రాజెక్టుని పక్కన పెట్టేశారని తెలుస్తోంది.
‘నేనే రాజు..’ హిట్ అయినప్పటికీ, ఆ తరవాత సురేష్ ప్రొడక్షన్ లో తేజ తీసిన ‘అహింస’ దారుణమైన డిజాస్టర్ గా మిగిలిపోయింది. దాంతో రానాతో సినిమా ఉండదని అనుకొన్నారు. కాకపోతే.. ‘రాక్షసరాజు’కు కొబ్బరి కాయ కొట్టి, రానా అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఈ సినిమా బడ్జెట్ కారణాలతో ముందుకు సాగడం లేదు. రానా కూడా ఇప్పుడు కొత్త కథల్ని కొన్ని సెటప్ చేసుకొనే పనిలో బిజీగా ఉన్నాడని తెలుస్తోంది. ఆర్కా మీడియా బ్యానర్లో రానా ఓ సినిమా చేయబోతున్నాడని, ఈ సినిమాతో ఓ కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడని సమాచారం. తేజ సినిమా స్థానంలో రానా ఈ చిత్రాన్ని పట్టాలెక్కించే ఛాన్సుంది. మరోవైపు నాని `హిట్ 3`లో రానా విలన్గా కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది. శైలేష్ కొలను ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.