‘బింబిసార’ అందరి ద్రుష్టిని ఆకర్షించిన దర్శకుడు వశిష్ఠ. కల్యాణ్ రామ్ హీరోగా ఆయన తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించింది. ఈ సినిమాతో ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసే అవకాశం అందుకున్నాడు. యువీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం దసరా సందర్భంగా లాంచ్ చేశారు.
ఈ సినిమాలో ఓ పవర్ ఫుల్ విలన్ పాత్ర వుంది. ఆ పాత్ర కోసం రానాని అనుకుంటున్నారని విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. దర్శకుడు వశిష్ట విలన్ పాత్రకోసం రానాని సంప్రదించడం, రానా ఓకే చెప్పడం జరిగిందని సమాచారం. అలాగే ఈ చిత్రంలో కథానాయికగా అనుష్క, నయనతార పేర్లని పరిశీలిస్తున్నారు. త్వరలోనే నటీనటుల వివరాలని అధికారంగా ప్రకటిస్తారు.
ఇదొక ఫాంటసీ జోనర్ చిత్రం. జగదేక వీరుడు అతిలోక సుందరి తర్వాత చిరంజీవిని ఫాంటసీ చిత్రాల్లో చూడలేదు. ఈ సినిమా అప్పటి పిల్లలను బాగా ఆకట్టుకుంది. అందుకే ఈతరం పిల్లలకు చిరంజీవిని అదే తరహాలో చూపించాలనుకుంటున్నాని ఇటివలే స్వయంగా దర్శకుడు వశిష్ట వెల్లడించాడు. ఈ సినిమాకి కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.